ETV Bharat / sports

Surya Kumar Yadav T20 Records : విండీస్​పై చెలరేగిన సూర్య.. దెబ్బకు ఆ ముగ్గురి రికార్డులు బ్రేక్​.. - ఇండియా వర్సెస్​ వెస్టిండీస్ లేటెస్ట్ అప్డేట్స్

Surya Kumar Yadav T20 Records : వెస్టిండీస్​తో జరిగిన మూడో టీ20లో తన మెరుపు షాట్లతో బాల్​ను బౌండరీలు దాటించాడు టీమ్​ఇండియా బ్యాటర్​ సూర్య కుమార్​ యాదవ్. ప్రావిడెన్స్‌ వేదికగా మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డ్‌ను అందుకోవడమే కాకుండా మరో నాలుగు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటంటే?

Surya Kumar Yadav T20 Records
Surya Kumar Yadav
author img

By

Published : Aug 9, 2023, 9:30 AM IST

Updated : Aug 9, 2023, 10:38 AM IST

Surya Kumar Yadav T20 Records : వెస్టిండీస్​తో జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా ప్లేయర్స్​ సత్తా చాటారు. నిలవాలంటే గెలవలంటూ జరిగిన ఈ హోరాహోరీ మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో హార్దిక్​ సేన ఘన విజయాన్ని తన ఖాతాలోకి వేసుకుంది. ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లోనే 83 పరుగులతో రాణించిన సూర్యకుమార్ యాదవ్​..'మ్యాన్​ ఆఫ్ ద మ్యాచ్​'గా నిలిచాడు. తన మెరుపు షాట్లతో బాల్​ను బౌండరీ దాటించిన మిస్టర్​ 360.. ప్రావిడెన్స్‌ వేదికగా ఈ అవార్డ్‌ను అందుకోవడమే కాకుండా మరో 4 రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటంటే..

రాహుల్​, గేల్​ను మించి..
T20 Sixes Record : విండీస్​తో జరిగిన మూడో టీ20లో ఇప్పటి వరకు కేఎల్ రాహుల్ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును సూర్యకుమార్ తన పేరిట రాసుకున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 72 టీ20 మ్యాచ్‌ల్లో 99 సిక్సర్లు కొట్టి.. భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన మూడో ఆటగాడిగా రాహుల్​ రికార్డుకెక్కాడు. అయితే సూర్యకుమార్​ యాదవ్ మాత్రం ఈ మ్యాచ్​లో 4 సిక్సర్లు బాది రాహుల్​ను వెనక్కి నెట్టాడు. ఇప్పటి వరకు 51 టీ20లు ఆడిన సూర్య.. విండీస్​ మ్యాచ్​తో 101 సికర్లను తన ఖాతాలోకి వేసుకున్నాడు.

51 మ్యాచ్‌ల్లో 101 సిక్సులు బాదిన సూర్య కుమార్​.. భారత్ తరఫున సిక్సర్ల సెంచరీ పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు ఈ లిస్ట్​లో రోహిత్, కోహ్లీ మాత్రమే ఉన్నారు. ఇప్పటివరకు ఆడిన 148 టీ20 మ్యాచ్‌ల్లో రోహిత్ 182 సిక్సర్లు కొట్టగా .. 115 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ మాత్రం 117 సిక్సర్లు బాదాడు.

Man of the Match Awards : అంతే కాకుండా భారత్ తరఫున అత్యధిక టీ20 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డులను గెలుచుకున్న రెండో ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్ రికార్డుకెక్కాడు. ఈ లిస్ట్​లో 15 అవార్డులతో కింగ్ కోహ్లీ టాప్​ ప్లేస్​లో ఉండగా, 12 అవార్డులతో సూర్యకుమార్​ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక 11 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డులతో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు.

విండీస్​ మ్యాచ్​లో బాదిన 4 సిక్సర్లతో సూర్య కుమార్​.. దిగ్గజ క్రికెటర్​ క్రిస్ గేల్ రికార్డ్‌ను కూడా సమం చేశాడు. ఇప్పటి వరకు ఆడిన 49 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లో 100 సిక్సర్లు బాదిన క్రిస్‌ గేల్ రికార్డును సూర్య కుమార్​ కూడా 49 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్క్‌ను అందుకున్నాడు. ఇక అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన ప్లేయర్​గా వెస్టిండీస్​ ప్లేయర్​ ఈవిన్ లూయిస్ అగ్రస్థానంలో ఉన్నాడు. లూయిస్ 48 ఇన్నింగ్స్‌ల్లోనే 48 సిక్సర్లు బాదాడు.

నిరాశపరిచినా నెం.1 ప్లేస్​లోనే సూర్య.. మరి కోహ్లీ ఎన్నో స్థానంలో అంటే?

'సూర్యకుమార్​ ఓ మేథమెటీషియన్‌.. ఆకాశం కూడా అతడికి హద్దు కాదు'

Last Updated : Aug 9, 2023, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.