ETV Bharat / sports

Stuart Broad Records : ఒకే ఓవర్లో 36 పరుగుల సమర్పించి.. టెస్టుల్లో టాప్ బౌలర్​గా ఎదిగి.. - స్టువర్ట్​ బ్రాడ్ బయోగ్రఫీ

Stuart Broad Records : తన రిటైర్మెంట్​ వార్తతో అందరిని షాక్​కు గురి చేశాడు ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌. దాదాపు 17 ఏళ్ల పాటు క్రికెట్​లో రాణించిన ఈ ఏస్ ప్లేయర్​.. అంతర్జాతీయ క్రికెట్‌కు క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ క్రికెట్​ లవర్స్​కు కంటతడి పెట్టించాడు. ప్రీ మెచ్యూర్​ బేబీగా పుట్టిన ఈ స్టార్​.. తన సుదీర్ఘ జర్నీలో ఎన్నో మైలు రాళ్లను దాటుకుని సంచలనాలు సృష్టించాడు. అవేంటంటే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 30, 2023, 4:37 PM IST

Stuart Broad Retirement : ఇంగ్లాండ్ దిగ్గజ స్టార్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ తన అభిమావనులతో పాటు క్రికెట్​ లవర్స్​కు చేదు వార్తను అందించాడు. 2006 నుంచి ఇప్పటి వరకు 17 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఆడిన ఈ స్టార్​.. అంతర్జాతీయ క్రికెట్‌కు క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ తన కెరీర్​కు ఓ బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్‌ ఆఖరి టెస్టు తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి తప్పుకున్నట్లు వెల్లడించాడు. అయితే ఓ సాధారణ స్ధాయి నుంచి ఇంగ్లండ్‌ లెజెండరీ క్రికెటర్​గా స్టువర్ట్​ ఎదిగిన తీరు.. ఎంతో మందికి స్పూర్తిదాయకం.

Stuart Broad Career : నాటింగ్‌హామ్‌లో 1986 జూన్ 24న బ్రాడ్​ జన్మించాడు. అయితే తన తల్లికి నెలల నిండకముందే కేవలం 907 గ్రాముల ప్రీ మెచ్యూర్ బేబీగా పుట్టాడు. దీంతో పుట్టిన క్షణమే అతను మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఊపిరి కూడా తీసుకోవడానికి కష్టపడ్డాడు. దీంతో దాదాపు నెల రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో స్టువర్ట్​ను ఇంక్యుబేటర్‌లోనే ఉండాల్సి వచ్చింది. అప్పటికీ ఆరోగ్యం కాస్త మెరుగుపడినప్పటికీ.. ఊపిరితిత్తుల సమస్య మాత్రం అలానే ఉండిపోయింది. నెలలు నిండకుండానే పుట్టడం వల్ల వల్ల బ్రాడ్ ఊపిరితిత్తుల్లో ఎదుగుదల సరిగ్గా లేదు. అందుకే ఇప్పటికీ అతను ఆస్తమాతో బాధపడుతున్నాడు.

అరంగేట్ర మ్యాచ్​లో కీలక వికెట్లు.. 17 ఏళ్ల కెరీర్​లో ఎన్నో రికార్డులు..
Stuart Board Records : 2005లో లీసెస్టర్‌షైర్ తరపున తన ఫాస్ట్‌ క్లాస్‌ కెరీర్‌ను ప్రారంభించిన బ్రాడ్​.. 2008లో నాటింగ్‌హామ్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తన ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 264 మ్యాచ్‌లు ఆడిన స్టువర్ట్​.. 948 వికెట్లు పడగొట్టాడు. 20 సార్లకు పైగా 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను సాధించి రికార్డుకెక్కాడు. ఆ తర్వాతి సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రాడ్​.. తన తొలి మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్‌ చేసి 14 పరుగులు సమర్పించుకుని 1 వికెట్‌ పడగొట్టాడు. కానీ వర్షం కారణంగా ఆ మ్యాచ్​ రద్దైంది. అయితే అదే ఏడాది పాకిస్థాన్ జట్టుపై టీ20 డెబ్యూ చేశాడు. ఈ క్రమంలో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండు కీలక వికెట్టు పడగొట్టి సత్తా చాటాడు.

ఇక 2007లో టెస్టు క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్టువర్ట్​.. తన అరంగేట్ర మ్యాచ్​ నుంచి ఇంగ్లీష్‌ జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతూ వచ్చాడు. అయితే 2016లో వైట్‌బాల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్న స్టువర్ట్​.. తన చివరి వన్డే మ్యాచ్​ను దక్షిణాఫ్రికాపై ఆడాడు. అప్పటి నుంచి కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగుతూ వస్తున్నాడు.కొన్నాళ్ల పాటు ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా కూడా బ్రాడ్‌ బాధ్యతలు వహించాడు.

తన 17 ఏళ్ల క్రికెట్​ కెరీర్​లో బ్రాడ్​ ఎన్నో అద్భుతమైన రికార్డులను నెలకొల్పాడు. ఇప్పటివరకు ఆడిన 166 టెస్టుల్లో 600 వికెట్లు సాధించాడు. అంతే కాకుండా 121 వన్డేల్లో 178 వికెట్లు తీసి రికార్డుకెక్కాడు. ఇక 56 టి20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్​ తరఫున అత్యధిక టెస్టులు ఆడిన రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అయితే ఈ జాబితాలో జెమ్స్‌ అండర్సన్‌ 182 మ్యాచ్‌లతో టాప్​ పొజిషన్​లో ఉండగా.. 166 టెస్టులతో బ్రాడ్‌ రెండో స్ధానాన్ని కైవసం చేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్ల పడగొట్టిన ఫాస్ట్‌ బౌలర్ల జాబితాలోనూ రెండో స్థానాన్ని సంపాదించుకున్న బ్రాడ్‌.. 600 వికెట్లతో రికార్డుకెక్కాడు..

బ్రాడ్​ అంటే అతనికి భయం.. కానీ..
2015లో జరిగిన యాషెస్ సిరీస్‌లో స్టువర్ట్‌ తన కెరీర్​లోనే బెస్ట్ గణాంకాలను నమోదు చేశాడు. ఈ క్రమంలో కేవలం 15 పరుగులిచ్చి.. 8 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఆ ఇన్నింగ్స్​లో 60 పరుగులకే పరిమితమై ఆలౌట్ అయ్యింది. మరోవైపు ఈ మ్యాచ్​లో బౌలింగ్​తోనే కాదు బ్యాటింగ్‌లోనూ రాణించాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 97 పరుగులు చేశాడు. ఫలితంగా ఇంగ్లాండ్​ 14 పరుగుల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

బౌలింగ్​లో అద్భుత ప్రదర్శన కనబరిచే స్టువర్ట్​.. 2010లో లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్టులో అద్భుతమైన బ్యాట్​తో చెలరేగిపోయాడు. పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 8 స్దానంలో బ్యాటింగ్‌కు దిగిన బ్రాడ్‌.. 169 పరుగులు స్కోర్​ చేసి అందరి చేత ఔరా అనిపించుకున్నాడు. అలా తన టెస్టు కెరీర్‌లో ఓ సెంచరీ, 13 అర్థ సెంచరీలను ఖాతాలో వేసుకుని 3640 పరుగులు చేశాడు.

Stuart Board Warner : తన టెస్టు కెరీర్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు చుక్కలు చూపించాడు. దీంతో గత కొంత కాలం నుంచి బ్రాడ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి వార్నర్‌ తీవ్ర ఇబ్బందులు పడుతూ కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన టెస్టుల్లో డేవిడ్ వార్నర్‌ని అతను 17 సార్లు పెవిలియన్​ బాట పట్టించాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ ప్లేయర్‌ని అత్యధిక సార్లు ఔట్​ చేసిన బౌలర్‌గా బ్రాడ్‌ ఓ రికార్డును తన పేరిట రాసుకున్నాడు.

2007లో జరిగిన టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియాతో జరిగిన మ్యాచ్‌ బ్రాడ్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ మ్యాచ్​లో యువరాజ్ సింగ్‌, ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది బ్రాడ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్ చేసిన స్లెడ్జింగ్ అలా చెలరేగిపోయాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.