ETV Bharat / sports

'ధనుష్క.. 'ఆమె' గొంతును బిగించి నరకం చూపించాడు'

ఆస్ట్రేలియాలో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలతో జైలుపాలైన శ్రీలంక క్రికెటర్‌ ధనుష్క గుణతిలక వ్యవహారంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళను గుణతిలక పలుసార్లు ఉక్కిరిబిక్కిరి చేశాడని తెలిసింది.

srilanka-cricketer-dhanuskha-gunathilaka

author img

By

Published : Nov 9, 2022, 10:41 PM IST

ఆస్ట్రేలియాలో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలతో జైలుపాలైన శ్రీలంక క్రికెటర్‌ ధనుష్క గుణతిలక వ్యవహారంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. లైంగిక దాడి కేసుకు సంబంధించి బాధిత మహిళపై గుణతిలక దారుణంగా ప్రవర్తించినట్లు సమాచారం. పలుసార్లు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేయడంతో గాయపడిందని, దీంతో బ్రెయిన్‌ స్కాన్‌ తీయించాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానిక మీడియా కథనాల్లో వెల్లడైంది. అతని తరపున న్యాయవాది ఆనంద అమర్‌నాథ్‌ బెయిల్‌ కోరగా.. మేజిస్ట్రేట్‌ రాబర్ట్‌ విలియమ్స్‌ తిరస్కరించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అమర్‌నాథ్‌ చెప్పాడు.

అయితే కేసు వివరాలను బయటకు రాకుండా చూడాలని దాఖలైన పిటిషన్‌ను మాత్రం మెజిస్ట్రేట్‌ రాబర్ట్‌ విలియమ్స్ అంగీకరిస్తూ గాగ్‌ ఆర్డర్ ఉత్తర్వులను జారీ చేశారు. ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన మహిళపై ఈ నెల 2న లైంగిక హింసకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఆదివారం సిడ్నీలో అరెస్టయ్యాడు. దీంతో అన్ని రకాల క్రికెట్‌ నుంచి గుణతిలకను తక్షణమే నిషేధిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్‌ (ఎస్‌ఎల్‌సీ) ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ ఆడేందుకు వెళ్లిన శ్రీలంక జట్టులో గుణతిలక సభ్యుడే. అయితే తొలి మ్యాచ్‌ ఆడిన తర్వాత గాయపడటంతో మిగతా మ్యాచ్‌లకు దూరంగా ఉండిపోయాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.