టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ నేడు(ఫిబ్రవరి 27) ముంబయిలో తన ఫియాన్సీ మిథాలీ పారుల్కర్‌తో కలిసి పెళ్లి పీటలెక్కనున్నాడు. ఈ పెళ్లికి సంబంధించిన పండగ వాతవారణం కొద్ది రోజుల ముందు నుంచే ప్రారంభమైపోయిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్గా మెహందీ వేడుకలో శార్దూల్ ఓ కుర్రాడితో కలిసి చేసిన ఓ మాస్ డ్యాన్స్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో వీడియో ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సారి ప్రీ వెడ్డింగ్ పంక్షన్లో శార్దూల్‌తో పాటు మరో టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
ఈ వేడుకలో అతడు తనదైన స్టైల్లో హంగామా చేశాడు. కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యుడైన అభిషేక్ నాయర్‌తో కలిసి పాటలు పాడాడు. బ్రాహ్మాస్త్ర సినిమాలోని 'కేసరియా' సాంగ్‌ను పాడి సర్ప్రైజ్ చేశాడు. అలా శ్రేయస్, నాయర్ తమ స్నేహితులతో కలిసి పాటలు పాడగా.. కాబోయే భార్య మిథాలీతో కలిసి శార్దూల్ రొమాంటిక్‌గా స్టెప్పులేశాడు. ఈ విధంగా కార్యక్రమమంతా సందడి సందడిగా సాగింది.
దీనికి సంబంధించిన వీడియోను కేకేఆర్ టీమ్ మేనేజ్‌మెంట్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా జోడించింది. 'కేకేఆర్ అబ్బాయిలపై ఎవరైనా ఎలా మనసు పారేసుకోకుండా ఉంటారు' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా.. నెటిజన్లు దీనిని ట్రెండ్ చేస్తూ.. విపరీతంగా లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. శ్రేయస్ ఆ జట్టుకు సారథిగా వ్యవహరిస్తుండగా.. శార్దూల్ జట్టు ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిశాక.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రేయస్-శార్దూల్ భాగం కానున్నారు. ఆ తర్వాత ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున కలిసి ఆడనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: ENG vs NZ: టెస్టుల్లో కేన్ మామ కొత్త రికార్డు.. అతడే నంబర్ వన్!