Shreyas Iyer Comeback : టీమ్ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. త్వరలో బ్లూ జెర్సీలో మైదానంలో కనిపించనున్నాడు. ఆగస్టు 30 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌నకు శ్రేయస్ అందుబాటులో ఉండనున్నాడు. ఈ ఏడాది మార్చ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో శ్రేయస్ గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శ్రేయస్.. డొమెస్టిక్, అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కాగా ఇటీవలె గాయం నుంచి కోలుకున్న శ్రేయస్.. బెంగళూరులో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో తాజాగా పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అయితే తాను ఫిట్‌నెస్‌లో మెరుగుపడేందుకు సహాయపడిన ఎన్సీఏ సిబ్బందికి శ్రేయస్.. కృతజ్ఞతలు తెలిపాడు.
-
Been a long journey but I'm super grateful to the people who stood by my side to help me to get where I am today. Thank you Nitin bhai and Rajini sir and everyone at The NCA, who've been tirelessly helping me. Much love and much appreciated 🙏 pic.twitter.com/i6YEAV8u8r
— Shreyas Iyer (@ShreyasIyer15) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Been a long journey but I'm super grateful to the people who stood by my side to help me to get where I am today. Thank you Nitin bhai and Rajini sir and everyone at The NCA, who've been tirelessly helping me. Much love and much appreciated 🙏 pic.twitter.com/i6YEAV8u8r
— Shreyas Iyer (@ShreyasIyer15) August 23, 2023Been a long journey but I'm super grateful to the people who stood by my side to help me to get where I am today. Thank you Nitin bhai and Rajini sir and everyone at The NCA, who've been tirelessly helping me. Much love and much appreciated 🙏 pic.twitter.com/i6YEAV8u8r
— Shreyas Iyer (@ShreyasIyer15) August 23, 2023
తనకు ఎంతగానో సహాయం చేసిన ఎన్సీఏ బృందంతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు."ఈరోజు నేను ఇలా ఉండేందుకు కృషి చేసిన వారందరికి కృతజ్ఞతలు. నేను కోలుకోవడానికి నిరంతరం సహాయం చేసిన నితిన్ భాయ్, రజనీ సర్ అలాగే మొత్తం ఎన్సీఏలోని అందరికీ ధన్యవాదాలు" అంటూ శ్రేయస్ ఆ ఫొటోకు క్యాప్షన్ రాసుకొచ్చాడు.
ఇక శ్రేయస్‌తో పాటు మరో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా గాయం నుంచి కోలుకొని.. ఆసియా కప్‌నకు ఎంపికయ్యాడు. ఇక వీరిద్దరూ మిడిలార్డర్లో రాణిస్తే.. టీమ్ఇండియాకు తిరుగు ఉండదనేది క్రీడాభిమానుల అభిప్రాయం. భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌తోనే ఈ మినీ టోర్నీని ప్రారంభించనుంది. కాాగా శ్రేయస్ ట్వీట్‌ను టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. రీట్వీట్ చేశాడు. "భాగ్ భాగ్ భాగ్ ఆయా షేర్ ఆయా షేర్" (సింహం పరిగెత్తుతూ వచ్చింది) అని సూర్య రాసుకొచ్చాడు.
-
Bhaag bhaag bhaag aaya sher aaya sher 🔥👊 https://t.co/ccurUOQ0wE
— Surya Kumar Yadav (@surya_14kumar) August 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bhaag bhaag bhaag aaya sher aaya sher 🔥👊 https://t.co/ccurUOQ0wE
— Surya Kumar Yadav (@surya_14kumar) August 23, 2023Bhaag bhaag bhaag aaya sher aaya sher 🔥👊 https://t.co/ccurUOQ0wE
— Surya Kumar Yadav (@surya_14kumar) August 23, 2023
Shreyas Iyer Odi Stats : వన్డే కెరీర్లో 42 మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ 46.6 సగటున 1631 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా శ్రేయస్ చివరి సారిగా 2023 జనవరిలో శ్రీలంకతో మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో శ్రేయస్ 32 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఓపెనర్ గిల్ (116), విరాట్ (166) భారీ శతకాలతో రెచ్చిపోవడం వల్ల భారత్ ఆ మ్యాచ్‌లో 390 భారీ స్కోర్ సాధించింది. అనంతంరం శ్రీలంక జట్టును 73 పరుగులకే ఆలౌట్ చేసి.. 317 పరుగుల భారీ విక్టరీ నమెదు చేసింది టీమ్ఇండియా
IPL 2023: శ్రేయస్ విషయంలో అనుకున్నదే జరిగిందిగా
టీమ్ఇండియాకు గుడ్‌న్యూస్.. శ్రేయస్ సర్జరీ సక్సెస్.. మెగాటోర్నీతో రీఎంట్రీ!