Shoaib Akthar Sachin Tendulkar: ఐసీసీ తీసుకొస్తున్న నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటున్నాయని కొద్దికాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నిబంధన వల్ల ఆట సహజత్వాన్ని కోల్పోతుందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయమై మాట్లాడాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. క్రికెట్లో ఉన్న ప్రస్తుత నిబంధనలు తాము ఆడే రోజుల్లో ఉండి ఉండే భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ మరిన్ని పరుగులు చేసేవాడని అన్నాడు. లక్షకు పైగా రన్స్ చేసేవాడని అభిప్రాయపడ్డాడు.
"మీకు రెండు కొత్త బంతులు ఉన్నాయి. నిబంధనలను కఠినం చేశారు. ఈ మధ్య కాలంలో బ్యాటర్లకు అనుకూలంగా నిబంధనలను రూపొందించారు. ఇప్పుడు మూడు రివ్యూలు ఇస్తున్నారు. సచిన్.. వసీం అక్రమ్, వాకర్ యూనిస్, షేన్ వార్న్, బ్రెట్ లీ, ముత్తయ్య మురళీధరన్ వంటి భీకర్ల బౌలర్లను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అందుకే అతడిని నేను టఫ్ బ్యాటర్ అంటాను. ఇప్పుడున్న నిబంధనలు మా రోజుల్లో ఉండి ఉంటే అతడు లక్ష పరుగులు చేసేవాడు."
-అక్తర్, పాక్ మాజీ క్రికెటర్.
క్రికెట్ బ్యాటింగ్ ఆధారిత క్రీడ అయిపోయిందని, కొత్త నిబంధనల వల్ల బౌలర్లకు ఎక్కువ ఉపయోగాలు లేవని అన్నాడు అక్తర్.
ఇదే విషయమై మాజీ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. "బ్యాట్, బంతి మధ్య ఆసక్తికర పోరు ఉండాలి. వన్డేల్లో రెండు కొత్త బంతులు ఉండటం బౌలర్లకు కష్టంగా మారింది. టెస్టుల్లో మూడు రివ్యూలు ఉండటం ఆమోదయోగ్యం కాదు" అని అన్నాడు.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!