దక్షిణాఫ్రికాపై టీమ్‌ఇండియా విజయం పాకిస్థాన్‌కు కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తొలి రెండు మ్యాచుల్లో ఓటమిపాలైన పాక్ జట్టు సెమీస్‌కు చేరాలంటే భారత్.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్‌లపై గెలిచి వాటి పాయింట్లను దెబ్బతీయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సఫారీలతో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ప్రదర్శనపై పాక్ దిగ్గజం షోయబ్ అక్తర్ అసహనం వ్యక్తం చేశాడు. భారత్ జట్టు నాలుగు వికెట్లు పడినప్పుడు అక్తర్ ఓ వీడియోను పోస్టు చేశాడు. ఇప్పుడది వైరల్‌గా మారింది.
"పాకిస్థాన్ కోసం టీమ్‌ఇండియా గెలవాలని నేను ఓ వీడియోలో చెప్పాను. కానీ వీళ్లు పాక్ పతనం కోసం ఆడుతున్నట్టుగా కనపడుతున్నారు. ఇప్పటికే నాలుగు వికెట్లు పోగొట్టారు. ఇక ముందు ఏం జరగబోతుందే తెలియడం లేదు" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, దీపక్ హుడా సఫారీల బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే వెనుదిరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 133/9 స్కోరు చేయగా.. అనంతరం దక్షిణాఫ్రికా 137/5 చేసి విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా (5) అగ్రస్థానంలోకి దూసుకెళ్లగా.. భారత్ (4) రెండో స్థానానికి పడిపోయింది.
-
Bhaiyo bahut jaldi main hain? pic.twitter.com/QVIf9Y4bj0
— Shoaib Akhtar (@shoaib100mph) October 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bhaiyo bahut jaldi main hain? pic.twitter.com/QVIf9Y4bj0
— Shoaib Akhtar (@shoaib100mph) October 30, 2022Bhaiyo bahut jaldi main hain? pic.twitter.com/QVIf9Y4bj0
— Shoaib Akhtar (@shoaib100mph) October 30, 2022
ఇవీ చదవండి: ఆ ఒక్కడుంటే టీమ్ ఇండియా ఫుల్ ఫిల్ అవుతుంది: కపిల్ దేవ్
పంత్ పాక్ జట్టులో ఉండుంటే ఇలా జరిగేదా? : పాక్ మాజీ పేసర్