ETV Bharat / sports

Shikhar Dhawan World Cup 2023 : వరల్డ్​ కప్​ జట్టుపై ధావన్ రియాక్షన్​.. ​గబ్బర్​ ట్వీట్​కు ఫ్యాన్స్​ ఫిదా​ - శిఖర్​ ధావన్ లేటెస్ట్ ట్వీట్

Shikhar Dhawan World Cup 2023 : వరల్డ్​ కప్​ తుది జట్టులో తనకు స్థానం దక్కనప్పటికీ టీమ్​ఇండియా సీనియర్​ ప్లేయర్ శిఖర్​ ధావన్‌ తన మంచి మనసును చాటుకున్నాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే?

Shikhar Dhawan World Cup 2023
Shikhar Dhawan World Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2023, 8:37 AM IST

Shikhar Dhawan World Cup 2023 : రానున్న ప్రపంచ కోసం ఎంపికైన టీమ్​ఇండియా సీనియర్​ ప్లేయయ్ శిఖర్​ ధావన్​కు జట్టులో స్థానం దక్కలేదు. దీంతో ఆయన అభిమానుల పాటు పలువురు మాజీలు ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై తొలిసారి శిఖర్ ధావన్ స్పందించాడు. తనకు టీమ్​లో చోటు దక్కకపోయినప్పటికీ..ధావన్‌ తన మంచి మనసును చాటుకున్నాడు. "వెళ్లి మీ ప్రతాపం చూపండి.. ట్రోఫీ గెలవండి" అంటూ రోహిత్​ సేనకు మద్దతిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్​ నెట్టింట తెగ ట్రెండ్​ అవుతోంది. దీన్ని చూసిన నెటిడన్లు ధావన్​ను కొనియాడుతున్నారు.

"వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కోసం ఇండియాకు ప్రాతినిధ్యం వహించనున్న నా సహచరులకు, స్నేహితులకు శుభాకాంక్షలు. దేశంలోని 150 కోట్ల మంది ప్రజలు ప్రార్థనలు, మద్దతుతోపాటు మా ఆశలు, కలలను మీరు మోస్తున్నారు. మీరు కప్పు గెలిచి మమ్మల్ని గర్వపడేలా చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతాపం చూపించండి టీమ్ఇండియా.. చక్ దె ఫట్టే" అంటూ ధావన్​ ట్వీట్​ చేశారు.

  • Congratulations to my fellow team mates & friends chosen to represent India in the WC 2023 tournament! With the prayers and support of 1.5 billion people, you carry our hopes and dreams.
    May you bring the cup back home 🏆 and make us proud! Go all out, Team India! 🇮🇳… https://t.co/WbVmD0Fsl5

    — Shikhar Dhawan (@SDhawan25) September 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Dhawan International Career : అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ధావన్‌.. అరంగేట్రంలోనే అదరగొట్టేశాడు. టెస్టు క్రికెట్లో అయితే తన దైన శైలిలో ఆడి అందరి చేత ఔరా అనిపించాడు. 2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో వన్డేల్లో.. 2011లో టీ20ల్లో, 2013లో టెస్టుల్లో అడుగులు వేశాడు. 2013లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన టెస్టు శతకం చేసిన అరంగేట్ర ఆటగాడిగా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ క్రమంలో అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు (187) నమోదు చేసిన భారత ఆటగాడిగానూ నిలిచాడు. మరోవైపు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో జరిగిన వన్డేల్లో శతకాలు సాధించాడు. కానీ ఇప్పుడు అతడి ఫామ్​లో తడబడటం వల్ల.. పరుగుల వేటలో విఫలమవుతున్నాడు.

Shikhar Dhawan Stats : అయితే టెస్టుల్లో ధావన్‌ నిలదొక్కుకోలేకపోయాడు. 2018లో చివరి టెస్టు మ్యాచ్​ ఆడాడు. 2021లో చివరగా టీ20 మ్యాచ్‌ ఆడాడు. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడినప్పటికీ.. మునుపటి లయను అందుకోలేకపోయాడు. పరుగులు చేయడంలోనూ ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో భారత్‌కు ఆడిన గత 10 వన్డే ఇన్నింగ్స్‌లోనూ ఆరుసార్లు రెండంకెల స్కోరు కూడా నమోదు చేయలేకపోయాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్‌ కెప్టెన్‌గా 11 మ్యాచ్‌ల్లో 373 పరుగులతో చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేసినప్పటికీ.. టీమ్ఇండియా జట్టులోకి రాలేకపోయాడు. గాయాలు, కుటుంబ సమస్యలు అతణ్ని వెనక్కి లాగాయి.

Ajit Agarkar Team Selection : 'అందుకే చాహల్​ను తప్పించాం.. ధావన్ మంచి ప్లేయరే కానీ'

Asia Cup Best Partnership : ధోనీ -రైనా.. ధావన్​- రోహిత్​.. ఆసియా కప్​లో బెస్ట్ పార్టర్న్​షిప్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.