Ipl Mini Auction 2023 : ఐపీఎల్ మినీ వేలంలో ఇంగ్లాండ్ ఆటగాడు శామ్ కరన్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరను సొంతం చేసుకొన్న ఆటగాడిగా నిలిచాడు. ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరీ పంజాబ్ కింగ్స్ (పీబికేఎస్) రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేసింది. తొలిసారి ఐపీఎల్‌లో అడుగు పట్టినప్పుడు పంజాబ్‌కే కరన్ ఆడాడు. ఇప్పుడు మళ్లీ తన పాత ఫ్రాంచైజీకి వచ్చేస్తున్నాడు. గత టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ విజయంలో కీలక పత్ర పోషించిన కరన్‌పై భారీ మొత్తం వెచ్చించడానికి గల కారణాలను పంజాబ్ కింగ్స్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు నెస్ వాడియా వెల్లడించారు.
"మా వద్ద తగినంత మొత్తం ఉండటంతోనే శామ్ కరన్‌ను దక్కించుకొన్నాం. కరన్ మళ్లీ మాతో కలవడం ఆనందంగా ఉంది. గతంలోనే కరన్‌ను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాం. అయితే అప్పుడు చెన్నై దక్కించుకొంది. ఇప్పుడు మళ్లీ వేలంలో మా సొంతమయ్యాడు. 24 ఏళ్ల శామ్ కరన్ ప్రపంచశ్రేణి ఆటగాడు. అలాగే సికిందర్ రజాను సొంతం చేసుకోవడం కూడా ఆనందంగా ఉంది. ఐపీఎల్‌లో రాణిస్తాడనే నమ్మకం ఉంది"
-నెస్ వాడియా, పంజాబ్ కింగ్స్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు
మోరిస్ రికార్డును అధిగమించి..
దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ 2021 సీజన్‌లో రూ.16.25 కోట్లను దక్కించుకొని రికార్డు సృష్టించాడు. ఇప్పుడు శామ్ కరన్ అంతకంటే ఎక్కువ మొత్తం సొంతం చేసుకోవడం విశేషం. టీ20 ప్రపంచకప్ 2022లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలవడం కరన్‌కు కలిసొచ్చిందని నిపుణులు అంచనా వేశారు.
ఇవీ చదవండి:
ముగిసిన ఐపీఎల్ మినీ వేలం.. శామ్ కరణ్ రికార్డ్.. టాప్ 10 ప్లేయర్లు వీళ్లే..
IPL మినీ వేలం.. అందరి దృష్టి కావ్య పాపపైనే.. ఆమెకు ఎందుకింత క్రేజ్?