ETV Bharat / sports

ఒకే చోట సచిన్, ధోని.. టెన్నిస్ కోర్టులో సరదాగా.. ఫొటోలు వైరల్ - ఒకే చోట కలిసిన సచిన్ ధోని

చాలా రోజుల తర్వాత సచిన్​ తెందూల్కర్​, ఎంఎస్​ ధోని ఒకే చోట కనిపించారు. దీంతో తమ అభిమాన క్రికెటర్ల ఫొటోలను వైరల్​ చేస్తున్నారు ఫ్యాన్స్​.

sachin tendulkar ms dhoni
sachin tendulkar ms dhoni
author img

By

Published : Oct 6, 2022, 8:15 PM IST

మాస్టర్​ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​.. ధనా ధన్ ధోని.. ఈ పేర్లు వింటే క్రికెట్​ అభిమానుల మనసు పులకించిపోతుంది. వీరిద్దరూ కలిసి చాలా మ్యాచ్​ల్లో ఆడారు. వీరిద్దరూ క్రికెట్​కు వీడ్కోలు పలికారు. ఇప్పుడు సచిన్​.. లెజెండ్స్​ లీగ్​లో ఆడుతున్నాడు. ధోని ఐపీఎల్​లో ఆడుతున్నాడు. వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ కనిపించబోతున్నాడు. రిటైర్మెంట్​ తర్వాత వీరిద్దరూ ఒకే చోట కనిపించడం చాలా అరుదు. అయితే తాజాగా సచిన్​, ధోని ఒకే చోట దర్శనమిచ్చారు. దీంతో తమ అభిమాన క్రికెటర్లు ఒకే ఫ్రేమ్​లో చూసి అభిమానులు ఆనందపడుతున్నారు. వారి ఫొటోలను వైరల్ చేస్తున్నారు.

చాలా రోజుల తర్వాత ఓ యాడ్​ షూటింగ్​లో భాగంగా టెన్నిస్​ ఆడుతూ మళ్లీ ఒక్క చోట కనిపించారు. అయితే క్రికెట్​ కాకుండా వీళ్లకు ఇతర ఆటలూ ఇష్టమే. ధోని, సచిన్​కు టెన్నిస్​ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు వీలు దొరికితే టెన్నిస్​ చూడటానికి వెళ్తాడు. అయితే ధోనికి ఫుట్​ బాల్​ కూడా ఇష్టమనే విషయం అభిమానులకు ఇదివరకే తెలుసు. సచిన్​ వింబుల్డన్​ మ్యాచ్​లు చూస్తాడు. రోజర్​ ఫెదరర్​ ఆడిన ఎన్నో మ్యాచ్​లు సచిన్ చూశాడు. ప్రస్తుతం ఈ లిటిల్​ మాస్టర్​.. ఇండియా లెజెండ్స్​కు కెప్టెన్​గా ఉన్నాడు. ఇటీవల జరిగిన రోడ్​సేఫ్టీ సిరీస్​ గెలిచింది ఈ టీమ్​.

ఇవీ చదవండి: 'విండీస్​ బాహుబలి' సూపర్​ ఇన్నింగ్స్‌.. టీ20ల్లో డబుల్‌ సెంచరీ

ట్రోలర్స్​కు బుమ్రా స్ట్రాంగ్​ కౌంటర్‌.. అలా చేస్తే మీ గోల్స్​ను చేరుకోలేరంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.