ETV Bharat / sports

Sachin Tendulkar First Century : సచిన్ తొలి సెంచరీకి 33 ఏళ్లు.. ఏ టీమ్​పై బాదాడో తెలుసా?

author img

By

Published : Aug 14, 2023, 12:59 PM IST

Sachin Tendulkar First Century : భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​ను క్రికెట్ గాడ్​గా పిలుచుకుంటారు అభిమానులు. అతడు దాదాపు 3 దశాబ్దాలపాటు ప్రపంచ క్రికెట్​లో రారాజుగా ఉన్నాడు. సచిన్ రిటైర్ అయ్యి 10 ఏళ్లు అవుతున్నా.. అతడి పేరిట ఉన్న రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదర్లేదు. అంతలా తన ఆటతో క్రికెట్ ప్రియులను ఆకట్టుకున్నాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టిన సచిన్​.. ఏ సంవత్సరం మొదటి సెంచరీ కొట్టాడో? ఏ టీమ్​పై తన మొదటి శతకం బాదాడో? తెలుసుకుందామా మరి.

sachin tendulkar first century
sachin tendulkar first century

Sachin Tendulkar First Century : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ పేరు చెబితే శతకాలు గుర్తొస్తాయి. టెస్టులు, వన్డేలు కలుపుకొని వంద సెంచరీలు బాదాడు ఈ మాస్టర్ బ్లాస్టర్​. అలాంటి సచిన్​ తెందూల్కర్ అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలి సెంచరీ చేసింది ఆగస్టు 14నే. ఇంగ్లండ్ గడ్డ మీద 1990లో అంటే 17 ఏళ్ల 112 రోజుల వయసులో సరిగ్గా ఇదే రోజు సచిన్ తొలి శతకం బాదాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్టులో అద్భుతంగా రాణించిన ఈ క్రికెటర్​.. ఓటమి గండం నుంచి భారత జట్టును గట్టెక్కించాడు. దిగ్గజ క్రికెటర్లు తడబడినా.. ఇంగ్లీష్ బౌలర్లకు ఎదురు నిలిచాడు. కాగా.. సచిన్ తొలి సెంచరీ చేసి నేటికి 33 ఏళ్లు.

Sachin Tendulkar First Century Against Which Team : ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్‌కు 408 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. డెవాన్ మెక్‌కల్లమ్, అంగస్ ఫ్రేసర్, ఎడ్డీ హెమ్మింగ్స్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడ్డారు. భారత బ్యాటర్​ సిద్ధు డకౌట్ కాగా.. రవిశాస్త్రి 12 పరుగులు, సంజయ్ మంజ్రేకర్ 50 రన్స్ చేసిన పెవిలియన్ చేరాడు. వెంగ్‌సర్కార్ కూడా 32 పరుగులకే అవుటయ్యాడు. 109 పరుగులకే నాలుగు టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన సచిన్ అద్భుతంగా రాణించాడు. 11 పరుగులు చేసిన కెప్టెన్ అజారుద్దీన్ అవుటైనా.. కపిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. హెమ్మింగ్స్ రిటర్న్ క్యాచ్ వదలడం వల్ల సచిన్‌కు లైఫ్ వచ్చింది. అది మొదలు అతడు వెనుదిరిగి చూడలేదు.. 189 బంతులను ఓపికగా ఎదుర్కొన్న సచిన్ 119 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 67 రన్స్‌తో మనోజ్ ప్రభాకర్ మాస్టర్‌కు అండగా నిలిచాడు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Sachin Tendulkar Stats : 24 ఏళ్ల కెరీర్‌లో 200 టెస్టు మ్యాచ్‌లు, 463 వన్డేలు ఆడాడు సచిన్. శతకాల వేటలో తనకు తానే సాటి అన్నట్లు 51 టెస్టు సెంచరీలు.. 49 వన్డే శతకాలతో ప్రపంచ రికార్డునే సృష్టించాడు. 100 అంతర్జాతీయ శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా సచిన్‌ నిలిచాడు. అతడి రికార్డుకు దరిదాపుల్లో కూడా నేటి తరం క్రికెటర్లు ఎవరూ లేరు.

Sachin Tendulkar Debut Match : సచిన్‌ తన తొలి టెస్టును 1989 నవంబర్‌లో కరాచీలో ఆడాడు. ఆ మ్యాచ్‌లో పాక్‌ ఫాస్ట్‌ బౌలర్‌ వకార్‌ యూనిస్‌ కూడా కెరీర్‌ ప్రారంభించడం విశేషం. తొలి మ్యాచ్‌లో 15 పరుగులే చేసి వకార్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. అదే సిరీస్‌ చివర్లో సియాల్‌ కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో వకార్‌ బౌలింగ్‌లో సచిన్‌ ముక్కుకు బంతి తాకింది. అయినా కానీ, మైదానం వీడటానికి నిరాకరించి బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఆ తర్వాత పెషావర్లో జరిగిన ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో నాటి పాక్‌ స్టార్‌ లెగ్‌ స్పిన్నర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ ఖాన్‌ వేసిన ఒక్క ఓవర్‌లో 27 పరుగులు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.

టెస్టు​ క్రికెట్లో మరో సంచలనం.. సచిన్​ రికార్డును బద్దలుగొట్టే ప్లేయర్​ అతడే!

దాతృత్వాన్ని చాటుకున్న క్రికెట్​ గాడ్​.. పేద పిల్లల కోసం స్కూల్​ కట్టించి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.