Rohit Sharma Daughter Video: టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ కరోనా బారిన పడి ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో కీలక టెస్టుకు ముందు ఇలా జరగడం టీమ్‌ఇండియాకు పెద్ద షాకే అయినా.. మ్యాచ్ ప్రారంభానికల్లా అతడు కోలుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, అతడు తుది జట్టులో ఉంటాడా..లేదా.. అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు రోహిత్ ఇప్పుడు ఐసోలేషన్‌లో ఉండటం వల్ల అతడి సతీమణి రితికా, కుమార్తె సమైరా వేరే చోటుకు మారిపోయారు. ఈ సందర్భంగా హోటల్ లాంజ్‌లో వారిని గమనించిన రోహిత్ అభిమానులు.. సమైరాను చూసి 'హాయ్' అని పలకరించారు. దీంతో ఆ చిన్నారి కూడా వారికి సైగలు చేసింది. అనంతరం వారు రోహిత్ గురించి అడిగిన ప్రశ్నలకు ఇంగ్లీష్‌లో ముద్దుముద్దుగా సమాధానమిచ్చింది.
హాయ్ సమైరా ఎలా ఉన్నావ్?
సమైరా: హాయ్.. నేను బాగున్నా.
మీ నాన్న ఎక్కడ ఉన్నాడు?
సమైరా: రూమ్‌లో ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ఇప్పుడెలా ఉన్నాడు? బాగున్నాడా?
సమైరా: హా.. ఇప్పుడు బాగున్నాడు. కానీ, నాన్నకు కొవిడ్-19 పాజిటివ్‌గా వచ్చింది. ఆయన కోలుకోవడానికి సమయం పడుతుంది.
ఇలా చాలా క్యూట్‌గా ఇంగ్లిష్‌లో సమాధానాలిచ్చింది. కాగా, ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయడం వల్ల రోహిత్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. మీరూ ఆ వీడియో ఆస్వాదించండి..
-
#RohitSharma Daughter #samaira Today at #Leicester How cute she is 😍😍 MY FATHER IS TAKING REST IN THE ROOM GOT #covidpositive @ritssajdeh @ImRo45 #ENGvIND @ITGDsports pic.twitter.com/Tbpu0HSUIQ
— Krishna sai ✊🇮🇳 (@Krishna19348905) June 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#RohitSharma Daughter #samaira Today at #Leicester How cute she is 😍😍 MY FATHER IS TAKING REST IN THE ROOM GOT #covidpositive @ritssajdeh @ImRo45 #ENGvIND @ITGDsports pic.twitter.com/Tbpu0HSUIQ
— Krishna sai ✊🇮🇳 (@Krishna19348905) June 27, 2022#RohitSharma Daughter #samaira Today at #Leicester How cute she is 😍😍 MY FATHER IS TAKING REST IN THE ROOM GOT #covidpositive @ritssajdeh @ImRo45 #ENGvIND @ITGDsports pic.twitter.com/Tbpu0HSUIQ
— Krishna sai ✊🇮🇳 (@Krishna19348905) June 27, 2022
ఇదీ చదవండి: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియా ఏం చేయనుందంటే?