WTC Final 2023 IND VS AUS : టీమ్ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ) ప్రారంభానికి ఇంకా కాసేపు మాత్రమే ఉంది. ఇప్పటివరకు ప్రాక్టీస్ చేసిన ఇరు జట్లు.. ఇక శిక్షణను పక్కన పెట్టి.. ప్రత్యర్థిని ఎలా పడగొట్టాలన్న విషయంపై మరిన్ని ఎత్తుగడలు రచిస్తున్నాయి. ఏ బ్యాటర్‌కు ఎలా అడ్డుకట్టు వేయాలి? ఏ బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలి అంటూ రెండు జట్లూ పథకాలు రచిస్తున్నాయి. అలాగే ఈ ఫైనల్లో తమదే విజయమంటూ గెలుపుపై ధీమాగా ఉన్నాయి.
Rohit Sharma as captain stats : అయితే ఇక్కడ ఓ విషయమేమిటంటే.. గత రికార్డులను పరిశీలిస్తే టీమ్ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇంకా మన కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా అన్నీ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా తిరుగులేని రికార్డు ఒకటి ఉంది. ప్రస్తుతం అతడు ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నప్పటికీ.. కెప్టెన్‌గా తన జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడంటే గెలిచి తీరాల్సిందే! అవును మీరు చదివింది నిజమే!
హిట్‌మ్యాన్ ఇప్పటివరకు సారథిగా.. తాను ప్రాతినిధ్యం వహించిన జట్లను 8 సార్లు ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లిన ఈ 8 సందర్భాల్లో రోహిత్ సేననే విజయం సాధించింది. కెప్టెన్‌గా రోహిత్‌కు మంచి ట్రాక్ రికార్డును తెచ్చిపెట్టింది. గతంలో రోహిత్ 2018 ఆసియా కప్, 2018 నిదాహస్ టోర్నీలో భారత్ జట్టుకు విజయాన్ని అందించాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్‌లో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబయి ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. రోహిత్ సారథ్యంలో ముంబయి ఇండియన్స్ 2013 ఛాంపియన్స్ లీగ్ కూడా విజయాన్ని అందుకుంది. దీంతో రోహిత్ ఖాతాలో ఇప్పటివరకు మొత్తం 8 ట్రోఫీలు చేరాయి. ఇప్పుడు దీని ఆధారంగానే.. భారత్ అభిమానులు ఈ సారి డబ్ల్యూటీసీ ఫైనల్ గద టీమ్ఇండియాదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు. 'ఇక్కడి దాకా వచ్చాడంటే.. జట్టు గెలిస్తుంది అంతే' అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. రోహిత్‌ను 'ది బాస్' అంటూ అభివర్ణిస్తున్నారు. ఒకవేళ అనుకున్నట్టు జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్లో రోహిత్‌కు ఇదే తొలి ఐసీసీ టైటిల్ అవుతుంది. రోహిత్ కూడా ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎలాగైనా గెలిచి తన ఖాతాలో మరో టైటిల్‌ను వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
![Rohit sharma As captain won all finals he lead looking WTC 2023 final](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18694921_wtccc.jpg)
ఇదీ చూడండి :
WTC Final 2023 : సమరానికి సిద్ధం.. అసలు ముప్పు అదే.. గద దక్కేనా!
kohli vs Australia : ఆసీస్‌పై సాధించిన కోహ్లీ రికార్డులివే.. మరి ఈసారి ఏం చేస్తాడో?