Rinku Singh Syed Mushtaq Ali Trophy : 2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా పంజాబ్ - ఉత్తర్‌ప్రదేశ్ జట్లు గురువారం తొలి క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్ నిర్దేశించిన 170 పరుగుల టార్గెట్‌ను పంజాబ్.. 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. బ్యాటర్లు నెహాల్ వధేరా (52 పరుగులు), అన్మోల్ప్రీత్ సింగ్ (43), సన్వీర్ సింగ్ (35), రమణ్‌దీప్ సింగ్ (22) రాణించారు. అయితే ఈ పోరులో ఉత్తర్‌ప్రదేశ్ ఓడినప్పటికీ.. ఆ జట్టు స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఆట మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
పంజాబ్ బౌలర్లను ఎదుర్కొనేందుకు యూపీ బ్యాటర్లు తెగ కష్టపడ్డారు. కానీ, మిడిలార్డర్లో వచ్చిన రింకూ సింగ్.. బీభత్సం సృష్టించాడు. అతడు అలవోకగా పంజాబ్ బౌలర్లను ఎదుర్కొంటూ.. బౌండరీలు సాధించాడు. ఈ క్రమంలోనే కేవలం 33 బంతుల్లో.. 233 స్ట్రైక్ రేట్‌తో 77 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. మరి అంతటి భీకరమైన ఇన్నింగ్స్ మీరు చూశారా.
-
Rinku Singh masterclass in Syed Mushtaq Ali Trophy:
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
77 in just 33 balls with 4 fours and 6 sixes for Uttar Pradesh. He's in phenomenal touch, the finisher Rinku...!!!pic.twitter.com/78nEKiUGuO
">Rinku Singh masterclass in Syed Mushtaq Ali Trophy:
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2023
77 in just 33 balls with 4 fours and 6 sixes for Uttar Pradesh. He's in phenomenal touch, the finisher Rinku...!!!pic.twitter.com/78nEKiUGuORinku Singh masterclass in Syed Mushtaq Ali Trophy:
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2023
77 in just 33 balls with 4 fours and 6 sixes for Uttar Pradesh. He's in phenomenal touch, the finisher Rinku...!!!pic.twitter.com/78nEKiUGuO
మరోవైపు సమీర్ రిజ్వీ (42 పరుగులు: 29 బంతుల్లో, 1x4, 4x6) కూడా అలవోకగా పరుగులు సాధించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 116 పరుగులు జోడించి.. తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పంజాబ్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్, హర్‌ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు.
'భువనేశ్వర్' సూపర్ స్వింగ్..
170 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు తొలుత తడబడ్డారు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0)ను.. భువీ ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. ఇక 2.5 ఓవర్ వద్ద మణిదీప్ సింగ్ (1)ను.. సూపర్ స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (12) కూడా మోసిన్ ఖాన్‌కు చిక్కాడు. దీంతో 14 పరుగులుకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ, తర్వాత వచ్చిన బ్యాటర్లు నిలకడగా రాణించడం వల్ల పంజాబ్ విజయతీరాలకు చేరింది.
-
Bhuvneshwar Kumar swings us back in time 😍 with this special delivery 🫶
— JioCinema (@JioCinema) November 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Keep watching the quarterfinals action from the #SyedMushtagAliT20 LIVE on #JioCinema & #Sports18 🙌 #SMAT #SMATonJioCinema #SMATonSports18 #JioCinemaSports pic.twitter.com/MpAMWbmJET
">Bhuvneshwar Kumar swings us back in time 😍 with this special delivery 🫶
— JioCinema (@JioCinema) November 2, 2023
Keep watching the quarterfinals action from the #SyedMushtagAliT20 LIVE on #JioCinema & #Sports18 🙌 #SMAT #SMATonJioCinema #SMATonSports18 #JioCinemaSports pic.twitter.com/MpAMWbmJETBhuvneshwar Kumar swings us back in time 😍 with this special delivery 🫶
— JioCinema (@JioCinema) November 2, 2023
Keep watching the quarterfinals action from the #SyedMushtagAliT20 LIVE on #JioCinema & #Sports18 🙌 #SMAT #SMATonJioCinema #SMATonSports18 #JioCinemaSports pic.twitter.com/MpAMWbmJET
Rinku Singh Birthday : గల్లీ నుంచి గోల్డ్ మెడల్ విన్నర్ దాకా.. రింకూ జర్నీ మీకు తెలుసా?