విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ క్రికెటర్లను పక్కనపెట్టడం కష్టమని, భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నందునే ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్(Ricky Ponting News) అన్నాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్(T20 World Cup) ఫేవరెట్ జట్లలో ఒకటిగా అడుగుపెట్టిన భారత్.. కనీసం సెమీఫైనల్స్‌కు కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టి నైపుణ్యం కలిగిన రుతురాజ్, పడిక్కల్, ఇషాన్ కిషన్ వంటి యువకులకు అవకాశాలివ్వాలని పలువురు మాజీలు, ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై 'ది గ్రేట్ క్రికెటర్' అనే కార్యక్రమంలో మాట్లాడిన పాంటింగ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
"టీమ్‌ఇండియా జట్టులో ఇప్పటికే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. మరికొంత మందిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ కూడా ముఖ్యమైన ఆటగాడే. అయినా, రోహిత్, రాహుల్, కోహ్లీలను పక్కనపెట్టలేరు. మరోవైపు హార్దిక్ పాండ్య కూడా జట్టులో ఉన్నాడు. ఒకవేళ అతడు బౌలింగ్ చేయకపోతే ఆ స్థానంలో యువ ఆటగాళ్లను ఉపయోగించుకోవచ్చు. టీమ్‌ఇండియాలో నైపుణ్యమున్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని గుర్తుంచుకోవాలి. జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఆడలేనప్పుడు వారిని తప్పించాలని అనుకుంటారు. వారికి చాలామంది ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నందునే ఇలాంటి మాటలు వినిపిస్తాయి" అని పాంటింగ్ వివరించాడు.
ఇదీ చదవండి: