ETV Bharat / sports

అండర్సన్​​పై జడ్డూ కామెంట్స్​ వైరల్​.. వీరిద్దరి మధ్య గొడవ ఏంటి? - Ravindra Jadeja Anderson fight

Ravindra Jadeja Anderson: 2014 తర్వాత ఇంగ్లాండ్​ ప్లేయర్​ అండర్సన్​కు ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందని అన్నాడు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా. ఎందుకు అన్నాడంటే...

Jadeja Anderson
అండర్స్​పై జడ్డూ కామెంట్స్​ వైరల్
author img

By

Published : Jul 3, 2022, 11:04 AM IST

Updated : Jul 3, 2022, 11:37 AM IST

Ravindra Jadeja Anderson: తనను మంచి బ్యాటర్‌ అని మెచ్చుకునేలా ఇంగ్లాండ్​ ప్లేయర్​ అండర్సన్​కు ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందని అన్నాడు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర. 2014లో తామిద్దరి మధ్య జరిగిన ఓ వివాదాన్ని గుర్తుచేసుకుని ఈ విధంగా అన్నాడు.

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో జడ్డూ(104).. అద్భుత శతకంతో అదరగొట్టేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రిషభ్‌ పంత్​తో(146) కలిసి 222 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. దీంతో భారత్‌ 416 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ ‌84/5 స్కోరుతో నిలిచింది.

ఈ క్రమంలోనే అండర్సన్ మాట్లాడుతూ.. "గతంలో జడేజా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చేది. అప్పుడు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసే అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఏడో స్థానంలో రావడం వల్ల క్రీజ్‌లో కుదురుకునేందుకు ఛాన్స్ దక్కింది. సరైన బ్యాటర్‌గా బ్యాటింగ్‌ చేశాడు. దీంతో మాకు కష్టాలు తప్పలేదు" అని పేర్కొన్నాడు.

దీనిపై జడ్డూ స్పందించాడు. "పరుగులు చేసినంత కాలం బానే ఉంటుంది. మంచి బ్యాటర్‌ అని ప్రతి ఒక్కరూ అంటుంటారు. అయితే ఇవేవీ నేను పట్టించుకోను. ఎప్పుడైనా సరే క్రీజ్‌లో సమయం గడిపేందుకు వంద శాతం ప్రయత్నిస్తా. నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్‌తో భాగస్వామ్యం నిర్మించేందుకు చూస్తా. అండర్సన్ కామెంట్లు విన్నాను. 2014 ఘటన తర్వాత అండర్సన్‌ నన్ను మంచి బ్యాటర్‌గా మెచ్చుకునేలా ఇప్పుడు జ్ఞానోదయం కలగడం బాగుంది" అని వివరించాడు.

ఇంతకీ 2014లో ఏం జరిగిందంటే?.. 2014లో ట్రెంట్‌ బ్రిడ్జ్‌ టెస్టు సందర్భంగా జడేజా, అండర్సన్‌ మధ్య పెవిలియన్‌ లోపల స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అకారణంగా జడేజాను అండర్సన్‌ పక్కకు తోశాడని ఇంగ్లాండ్‌ మేనేజ్‌మెంట్‌పై టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో నిబంధనల ప్రకారం లెవల్-3 కింద అండర్సన్‌పై ఐసీసీ చర్యలు తీసుకొంది. ఇప్పుడు ఆ సంఘటనను గుర్తు చేస్తూ జడేజా వ్యాఖ్యానించడం వైరల్‌గా మారింది.

చాలా కఠినం.. "ఇంగ్లాండ్‌ పిచ్‌లు స్వింగ్, పేస్‌కు బాగా సహకరిస్తాయి. అందుకే శరీరానికి దగ్గరగా వచ్చిన బంతులనే ఆడాలి. బయట పడిన బాల్‌ను కవర్‌డ్రైవ్‌, స్క్వేర్‌ డ్రైవ్‌గా ఆడాలని ప్రయత్నిస్తే మాత్రం బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకునే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆఫ్‌ స్టంప్‌ ఆవల పడిన బంతులను వదిలేసేందుకే ప్రాధాన్యత ఇచ్చా. పొరపాటున ఆడామంటే స్లిప్‌లో దొరికిపోవడం ఖాయం. నా శరీరానికి దగ్గరగా వచ్చిన బంతులనే బౌండరీలకు తరలించేందుకు ప్రయత్నించా. అదృష్టవశాత్తూ అలాంటివే ఎక్కువగా వచ్చాయి. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతులను వదిలేయడమే ఉత్తమం. రిషభ్‌ పంత్‌తో భాగస్వామ్యం నిర్మించడం బాగుంది. రిషభ్‌ ఆడేటప్పుడు నాపై ఒత్తిడి పెద్దగా లేదు. ఎందుకంటే ప్రతి బౌలర్‌ను పంత్‌ బాదేశాడు. నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న నాపై బౌలర్ల దృష్టి పెట్టకపోవడానికి కూడా పంతే కారణం. క్రీజ్‌లో పాతుకుపోయి మరిన్ని పరుగులు చేయాలని మాట్లాడుకుంటూ ఉన్నాం. చివరికి మంచి స్కోరునే నమోదు చేశామని భావిస్తున్నా" అని జడేజా తెలిపాడు.

ఇదీ చూడండి: 'అది ప్లాన్​ కాదు.. బౌలర్లను మానసికంగా దెబ్బ తీసేందుకే అలా ఆడా'

Last Updated : Jul 3, 2022, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.