ETV Bharat / sports

నేను పొరపాటున టీమ్​ఇండియాకు కోచ్​ అయ్యాను: రవిశాస్త్రి - రాహుల్​ ద్రవిడ్

Ravi shastri on rahul dravid: టీమ్​ఇండియాకు తాను పొరపాటున కోచ్​గా ఎంపికయ్యాను అంటున్నాడు మాజీ కోచ్​ రవిశాస్త్రి. ఈ సందర్భంగా ప్రస్తుత కోచ్​ రాహుల్​ ద్రవిడ్​పై ప్రశంసలు కురిపించాడు. ఓ క్రమ పద్ధతిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చి.. సీనియర్​ జట్టుకు ప్రధాన కోచ్​ అయ్యాడని పేర్కొన్నాడు. జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడని వ్యాఖ్యానించాడు.

రవిశాస్త్రి
రవిశాస్త్రి
author img

By

Published : Jul 3, 2022, 10:24 PM IST

Ravi shastri on rahul dravid: టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్‌ ద్రవిడ్ అద్భుతంగా జట్టును నడిపిస్తున్నాడని మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. అదే విధంగా ద్రవిడ్ భారత టీమ్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తున్నాడని పేర్కొన్నాడు. "నేను కోచింగ్‌ బాధ్యతల నుంచి వీడ్కోలు పలికిన తర్వాత దానికి సరైన వ్యక్తి రాహుల్ ద్రవిడ్‌ మాత్రమే. ఇంకెవరూ కాదనేది నా అభిప్రాయం. అసలు నేనే పొరపాటున కోచ్‌గా మారా. కామెంట్రీ బాక్స్‌లో కూర్చొని ఉండే నాకు కోచింగ్‌ బాధ్యతలు అప్పగించారు. జట్టును నడిపించడంలో నావంతు కృషి చేశా. అయితే రాహుల్‌ మాత్రం నా మాదిరిగా కాదు. ఓ క్రమ పద్ధతిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. అండర్‌-19, టీమ్‌ఇండియా సెకండ్‌ టీమ్‌లకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. సీనియర్‌ జట్టుకు ప్రధాన్‌ కోచ్‌ అయ్యాడు. తన సలహాలు, సూచనలను టీమ్‌ సభ్యులు అందుకొని రాణిస్తే ఎలాంటి కోచ్‌కైనా హాయిగా ఉంటుంది. ఇప్పుడు ద్రవిడ్ కూడా అందులోని కిక్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు" అని పేర్కొన్నాడు.

రవిశాస్త్రి హయాంలో భారత్‌ ఐసీసీ ట్రోఫీని మినహా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌లను కైవసం చేసుకొని అద్భుతాలు సృష్టించింది. "కోచ్‌గా మారిన వ్యక్తికి విమర్శలను పట్టించుకోని తత్వం ఉండాలి. అయితే నా చివరి రోజుల్లో మీడియాతో కాస్త కంగారు పడాల్సి వచ్చింది. ఆటగాళ్లు బాగా ఆడితే ఒకరకంగా.. విఫలమైతే మరో రకంగా వ్యాఖ్యలు వినాల్సి ఉంటుంది. అయితే మీడియా వల్లనే నా పని కాస్త తేలికగా మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే స్వదేశంలో తప్పితే విదేశాల్లో రాణించలేమనే మీడియా కథనాలను తప్పుగా నిరూపించడమే నా జాబ్‌గా భావించా. దాని కోసం జట్టుతో కూర్చొని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించా. విరాట్‌తో ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు పిచ్‌ ఏదైనా సరే మనం 20 వికెట్లను తీయాలని చెప్పేవాడిని" అని రవిశాస్త్రి వివరించాడు. రాహుల్ ద్రవిడ్‌ హయం వచ్చేసరికి టీమ్‌లో సారథుల సంఖ్య ఎక్కువైపోయిందనే చెప్పొచ్చు. అందుకే వేర్వేరు సిరీస్‌లకు ప్రత్యేకంగా జట్టును తయారు చేసి మరీ బీసీసీఐ పంపించింది. రాబోయే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను సిద్ధంగా ఉంచుకోవడానికి ఈ ప్రక్రియను చేపట్టింది.

ఇదీ చూడండి : అండర్సన్​​పై జడ్డూ కామెంట్స్​ వైరల్​.. వీరిద్దరి మధ్య గొడవ ఏంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.