ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌లో మరో శకం ముగిసింది. ఆ జట్టు సీనియర్ క్రికెటర్ రేచల్ హేన్స్ అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ నిక్ హాక్‌లీ తెలిపారు. ''ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ రేచల్ హేన్స్ సేవలు కోల్పోనుంది. దాదాపు దశాబ్దానికి పైగా క్రికెట్‌లో సేవలందించిన ఆమె ఇవాళ ఆటకు వీడ్కోలు పలకడం మా దురదృష్టం. ఇన్నేళ్లలో ఆమె జట్టు తరపున ఎన్నో విజయాల్లో భాగస్వామ్యమైమంది. రేచల్ హేన్స్ ఆడిన కాలంలో ఆస్ట్రేలియా ఆరు మేజర్ టోర్నీలు గెలవడం ఆమెకు గర్వకారణం. ఇకపై తన ప్రయాణం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నాం'' అని అన్నాడు.
కాగా, రేచల్.. ఆస్ట్రేలియా తరపున 6 టెస్టుల్లో 383 పరుగులు, 77 వన్డేల్లో 2585 పరుగులు, 84 టి20ల్లో 850 పరుగులు చేసింది. హేన్స్ ఖాతాలో రెండు వన్డే సెంచరీలు ఉన్నాయి. కాగా టెస్టుల్లో అరంగేట్రం ఇచ్చిన డెబ్యూ మ్యాచ్‌లోనే హేన్స్ 98 పరుగులు చేసి ఆకట్టుకుంది. ఇక హేన్స్ చివరగా బర్మింగ్‌హమ్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో టీమ్ఇండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆడింది. ఈ మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా స్వర్ణ పతకం గెలిచింది. ఇక హేన్స్ పలు సందర్భాల్లో జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించింది. 2017 వన్డే వరల్డ్‌కప్‌లో ఒక మ్యాచ్‌లో జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ భుజం గాయంతో పక్కకు తప్పుకోవడం వల్ల నాయకత్వ బాధ్యతలు నిర్వహించింది. ఆ తర్వాత 2018లో తొలిసారి వైస్ కెప్టెన్ అయిన రేచల్ హేన్స్ 2020లో టీ20 వరల్డ్ కప్, 2022లో వన్డే వరల్డ్‌కప్‌ను గెలవడంలో.. కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా స్వర్ణం గెలవడంలోనూ కీలకపాత్ర పోషించింది.
ఇదీ చూడండి: వినేశ్ ఫొగాట్ రికార్డు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండో పతకం