ETV Bharat / sports

ప్రపంచకప్​ ఫైనల్లో ఆసీస్-ఇంగ్లాండ్ ఢీ.. ఆ జట్టుకు మోదీ విషెస్

ICC Women's World Cup: ఐసీసీ మహిళల ప్రపంచకప్​ ఫైనల్లో ఇంగ్లాండ్​తో ఆదివారం హోరాహోరీకి దిగనుంది ఆస్ట్రేలియా. ఈ నేపథ్యంలో ఆసీస్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆ జట్టు బాగా ఆడాలని అన్నారు.

PM Modi extends good wishes to Team Australia

author img

By

Published : Apr 2, 2022, 3:31 PM IST

ICC Women's World Cup: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్​ ఫైనల్​ ఆడనున్న ఆస్ట్రేలియా జట్టు​కు శుభాకాంక్షలు​ తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఆస్ట్రేలియా-భారత్​ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తున్న సమయంలో.. శనివారం ఉదయం ఈ ప్రకటన చేశారు. ఇంగ్లాండ్​తో ఆదివారం అమీతుమీ తేల్చుకోనుంది కంగారూ జట్టు. క్రైస్ట్​చర్చ్​ వేదికగా ఉదయం 6.30 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

''ఆస్ట్రేలియా మహిళల జట్టుకు ముందుగా నా అభినందనలు. రేపు (ఆదివారం) వన్డే ప్రపంచకప్​ ఫైనల్లో వారు గొప్పగా ఆడాలని ఆశిస్తున్నాను​.''

-నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ఇప్పటివరకు 11 మహిళల వన్డే వరల్డ్​కప్​లు జరగ్గా.. ఆసీస్​ 6, ఇంగ్లాండ్​ 4 సార్లు టైటిల్​ విజేతలుగా నిలిచాయి. న్యూజిలాండ్​ ఓసారి టోర్నీ గెలిచింది. 2017లో జరిగిన చివరి ప్రపంచకప్​లో భారత్​పై గెలిచి.. ఛాంపియన్​గా అవతరించింది ఇంగ్లాండ్​. ఈసారి ఆసీస్​పై గెలిచి.. టైటిల్ నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ రెండు జట్లూ వరల్డ్​కప్​ ఫైనల్లో చివరిసారిగా 1988లో తలపడ్డాయి. అప్పుడు ఇంగ్లాండ్​పై 8 వికెట్ల తేడాతో గెలిచింది ఆసీస్​. మళ్లీ 34 ఏళ్లకు ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

ఈ మెగా టోర్నీలో ఆసీస్​కు మెరుగైన రికార్డు ఉంది. మొత్తం ఏడు సార్లు ఫైనల్​కు వెళ్లి.. ఆరు సార్లు టైటిల్​ గెల్చుకుంది. ఒకే ఒక్కసారి న్యూజిలాండ్​ చేతిలో(200లో) అదీ 4 పరుగుల తేడాతో ఓడింది. మరోవైపు.. ఇంగ్లాండ్​ 4 సార్లు టైటిల్​ గెల్చుకొని.. మరో 3 సార్లు ఫైనల్లో ఓటమిపాలైంది. ఆ మూడు సార్లూ ప్రత్యర్థి ఆసీస్​ కావడం ఆ జట్టుకు కలవరపరుస్తోంది. ఫైనల్లో ఇంగ్లాండ్​ ఒకే ఒక్కసారి ఆసీస్​పై గెలిచింది. అదీ 1973లో జరిగిన మొట్టమొదటి ప్రపంచకప్​లో. మరి ఈసారి గెలిచి ఆసీస్​ ఏడో టైటిల్​ సాధిస్తుందా? ఇంగ్లాండ్​ ఛాంపియన్​ హోదాను నిలుపుకుంటుందా? అనేది చూడాలి.

ఇదీ చదవండి: 'ఆ 35 పరుగులే నాకు అత్యుత్తమం'- 11 ఏళ్లు వెనక్కి వెళ్లిన కోహ్లీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.