Pakistan Vs Australia Test Series 2023 : ఆస్ట్రేలియాలో పాక్ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైంది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం శుక్రవారం ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ ప్లేయర్లకు ఆతిథ్య దేశం స్వాగతం పలకలేదు. అటు పాకిస్థాన్ ఎంబసీ అధికారులు కూడా ఎయిర్‌పోర్టుకు రాలేదు. దీనికి తోడు పాకిస్థాన్ ప్లేయర్ల లగేజీ బ్యాగ్‌లను తీసుకెళ్లేందుకు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో చేసేదేమీ లేక ప్లేయర్లే తమ లగేజీని మోసుకున్నారు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ లగేజీని ట్రక్‌లోకి ఎక్కించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
-
Pakistan Cricket Team at Sydney arranging their luggage were indeed a display of their own initiative. No mismanagement by the airport staff - the players voluntarily arranged their luggage in the truck as they preferred.#BabarAzam𓃵 #PAKvsAUS pic.twitter.com/sOosou7cr4
— Cricket In Blood (@CricketInBlood_) December 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pakistan Cricket Team at Sydney arranging their luggage were indeed a display of their own initiative. No mismanagement by the airport staff - the players voluntarily arranged their luggage in the truck as they preferred.#BabarAzam𓃵 #PAKvsAUS pic.twitter.com/sOosou7cr4
— Cricket In Blood (@CricketInBlood_) December 1, 2023Pakistan Cricket Team at Sydney arranging their luggage were indeed a display of their own initiative. No mismanagement by the airport staff - the players voluntarily arranged their luggage in the truck as they preferred.#BabarAzam𓃵 #PAKvsAUS pic.twitter.com/sOosou7cr4
— Cricket In Blood (@CricketInBlood_) December 1, 2023
అయితే తమ దేశానికి వచ్చిన జట్టుకు స్వాగతం పలకడం సదరు ఆతిథ్య క్రికెట్ బోర్డు కనీస కర్తవ్యం. కానీ పాకిస్థాన్ జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై క్రికెట్ అభిమానులతో పాటు పాకిస్థాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పర్యటన నిమిత్తం వచ్చిన దేశాలను అవమానించడం ఆస్ట్రేలియాకు ఇదేం తొలిసారి కాదని అభిమానులు మండిపడుతున్నారు. గతంలో కూడా అగ్ర జట్లకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేక క్రికెట్ ప్రియుల ఆగ్రహానికి గురైందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఇక 2021లో భారత జట్టు పర్యటనలోనూ ఆసీస్ ఇలాగే ప్రవర్తించిందని వార్తలు వచ్చాయి. దీంతో కంగారూ క్రికెట్ బోర్డు ప్రవర్తనపై విమర్శలు వెల్లుత్తున్నాయి.
-
Yeh Pakistan nahin, yeh Australia hay aur yahan aise hi karna parta hay. Apnay samaan ki hifazat khud karen :)
— Farid Khan (@_FaridKhan) December 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
- via Sohail Imran #AUSvPAK pic.twitter.com/FDaRbQbl45
">Yeh Pakistan nahin, yeh Australia hay aur yahan aise hi karna parta hay. Apnay samaan ki hifazat khud karen :)
— Farid Khan (@_FaridKhan) December 1, 2023
- via Sohail Imran #AUSvPAK pic.twitter.com/FDaRbQbl45Yeh Pakistan nahin, yeh Australia hay aur yahan aise hi karna parta hay. Apnay samaan ki hifazat khud karen :)
— Farid Khan (@_FaridKhan) December 1, 2023
- via Sohail Imran #AUSvPAK pic.twitter.com/FDaRbQbl45
Pakistan Vs Australia Test Series 2023 : ఇదిలా ఉండగా మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం పాకిస్థాన్ శుక్రవారం ఆస్ట్రేలియా చేరుకుంది. పెర్త్ స్టేడియం వేదికగా డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 18 వరకు మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రెండో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్- ఎమ్‌సీజీలో జరగుతుంది. ఇక 2024 జనవరి 03 నుంచి 2024 జనవరి 07 వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మూడే టెస్టులో పాక్, ఆసీస్ తలపడనున్నాయి.
'అవసరమైతే వరల్డ్‌కప్‌పై మళ్లీ కాళ్లు పెడతా'- మిచెల్ మార్ష్ సంచలన వ్యాఖ్యలు!
భారత్-ఆసీస్ నాలుగో టీ20కి కరెంట్ కష్టాలు- జనరేటర్లపైనే భారం- గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి!