Pakistan Team Kolkata Biryani : 2023 వరల్ట్ కప్‌లో పాకిస్థాన్ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతోంది. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండింట్లో విజయం సాధించి విమర్శలు పాలైంది. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్లో కూడా ముసలం మొదలైంది. అంతేకాకుండా వాట్సాప్ చాట్ లీక్ వల్ల బాబర్ అజామ్ కూడా వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్లేయర్స్ చేసిన మరో పనితో పాక్ జట్టు విమర్శల పాలైంది. పాకిస్థాన్ ప్లేయర్లు హోటల్‍లో డిన్నర్‌కు నో చెప్పి.. బయట నుంచి ఆహారం ఆర్డర్ చేసుకున్నారు.
Pakistan Team Refuses Dinner : మంగళవారం (అక్టోబర్ 31న) బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా చేరుకున్న పాక్ టీమ్ ఓ హోటల్‍లో బస చేసింది. ఆదివారం సాయంత్రం హోటల్‍లో డిన్నర్ వద్దనుకుని.. ఓ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా కోల్‌కతాలోని ఫేమస్ 'జామ్ జామ్ రెస్టారెంట్' నుంచి బిర్యానీ, కబాబ్స్, చాప్ వంటి వాటిని ఆర్డర్ చేశారు. ఈ మేరకు 'జామ్ జామ్ రెస్టారెంట్' డైరెక్టర్ షద్మాన్ ఫైజ్ ద్వారా బయపడింది. అయితే ఆ ఆర్డర్ పాకిస్థాన్ ఆటగాళ్ల నుంచి వచ్చిందనే విషయం మొదటి తమకు తెలియదని.. ఆ తర్వాత తెలిసిందని షద్మాన్ చెప్పారు. కోల్‌కతా బిర్యానీ ప్రత్యేకంగా ఉంటుందని.. ప్రపంచవ్యాప్తంగా అది ఫేమస్ అని చెప్పారు. ఇలా పాక్ క్రికెటర్లు తమ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేయడం చాలా సంతోషంగా ఉందని షద్మాన్ తెలిపారు.
'మా ప్లేయర్లు రోజుకు 8 కిలోల మాంసం తింటున్నారు'
అయితే, ఇంతకుముందు పాకిస్థాన్ ఆటగాళ్ల ఆహార అలవాట్లు, ఫిట్‍నెస్‍పై పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ సహా పలువురు విమర్శలు గుప్పించారు. అఫ్గానిస్థాన్ చేతిలో పాక్ ఓడిపోయిన తర్వాత ఓ స్పోర్ట్స్ ఛానల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'మా ఆటగాళ్ల ఫిట్‌నెస్ లెవెల్స్ చూడండి. గత రెండేళ్లుగా ఫిట్‌నెస్ టెస్టులు చేయలేదని మేము కొన్నాళ్లుగా చెబుతున్నాం. చూస్తుంటే వారు (పాకిస్థాన్ ప్లేయర్లు) ప్రతిరోజు 8 కిలోల మాంసం తింటున్నట్లు కనిపిస్తోంది. ఏదో ఒక పరీక్ష జరగాలి. మీ దేశం కోసం ఆడినందుకు మీకు డబ్బు చెల్లిస్తున్నారు. కాబట్టి ఒక నిర్దిష్ట ప్రమాణం ఉండాలి' అని ఆటగాళ్ల ఫిట్‍నెస్‍పై వసీం అక్రమ్ అసహనం వ్యక్తం చేశారు.
Babar Azam Chat Leak : వివాదాల్లో చిక్కుకున్న బాబర్ అజామ్.. అండగా పాక్ మాజీ కెప్టెన్!