ETV Bharat / sports

మేం బాగా ఆడితే సీనియర్లు తట్టుకోలేరు: పాక్​ బ్యాటర్​

Pakisthan batter Ahmed Shehzad: పాకిస్థాన్‌ బ్యాటర్‌ అహ్మద్‌ షెజాద్‌ షాకింగ్ కామెంట్స్​ చేశాడు. ఒకరు విజయవంతమైతే తమ సీనియర్లు తట్టుకోలేరని, వారు సంతోషంగా ఉండలేరని విమర్శలు చేశాడు. టీమ్​ఇండియాలో ధోనీ ఉండటం వల్లే కోహ్లీ బాగా రాణించాడని, కానీ తమ జట్టులో మహీలాగా ప్రోత్సహించే ప్లేయర్స్​ లేరని అన్నాడు.

Pakisthan batter Ahmed Shehzad
పాకిస్థాన్‌ బ్యాటర్‌ అహ్మద్‌ షెజాద్‌
author img

By

Published : Jun 26, 2022, 5:14 PM IST

Pakisthan batter Ahmed Shehzad: పాకిస్థాన్​ క్రికెటర్​ అహ్మద్​ షేజాద్​ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో ఎవరైనా బాగా ఆడితే మాజీ, సీనియర్​ ప్లేయర్స్​ ఓర్వలేరని విమర్శించాడు. ఈ విషయం తాను ఇదివరకే చెప్పినా మళ్లీ చెబుతున్నానన్నాడు. చాలా రోజులుగా జట్టులో చోటు కోల్పోయిన అతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు జరిగిన అన్యాయంపై స్పందించాడు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ కోహ్లీ విజయవంతమవ్వడానికి ధోనీనే కారణమని చెప్పాడు.

"కోహ్లీ అద్భుతంగా రాణించడానికి ధోనీనే కారణం. అతడు అండగా ఉంటూ మద్దతివ్వడం వల్లే విరాట్‌ విజయవంతమయ్యాడు. కానీ, దురదృష్టం కొద్దీ పాకిస్థాన్‌లో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ జట్టులోని సీనియర్లు, మాజీ ఆటగాళ్లు.. ఎవరైనా అద్భుతంగా ఆడితే తట్టుకోలేరు. వారు విజయవంతమైతే సహించలేరు. అలాగే విరాట్‌ రెండేళ్లుగా ఫామ్‌ అందుకోలేక తంటాలు పడుతున్నాడు. అదే నా విషయంలో రెండు మ్యాచ్‌లు ఆడకపోయేసరికే పక్కనపెట్టారు. నన్ను దేశవాళీ క్రికెట్‌లో ఆడమన్నారు. అక్కడ నేను అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచినా పాకిస్థాన్‌ తరఫున ఆడటానికి మరో అవకాశం ఇవ్వలేదు" అని షెజాద్‌ చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి: Ranji Trophy: తొలిసారి ట్రోఫీని ముద్దాడిన మధ్యప్రదేశ్ టీమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.