ETV Bharat / sports

ODI World Cup 2023 : టీమ్​ఇండియాకు నో హాలిడేస్.. అక్కడే ఉండిపోయిన ప్లేయర్స్​.. ఎందుకంటే? - వన్డే వరల్డ్ కప్ 2023 పాయింట్స్​ టేబుల్​

TeamIndia No Holidays : టీమ్​ఇండియా రెండు రోజుల పాటు హాలీడేస్​ తీసుకోనున్నట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జట్టు హాలీడే తీసుకోలేదట. అక్కడే ఉండిపోయిందట.

ODI World Cup 2023 : టీమ్​ఇండియాకు నో హాలిడేస్.. అక్కడే ఉండిపోయిన ప్లేయర్స్​.. ఎందుకంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 9:24 PM IST

ODI World Cup 2023 TeamIndia No Holidays : వన్డే వరల్డ్ కప్​ 2023లో టీమ్​ ఇండియా జైత్రయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన పాయింట్స్ టేబుల్‌లో(ODI World Cup 2023 Points Table) టాప్ పొజిషన్​లో ఉంది. అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక భారత జట్టు తన తర్వాతి మ్యాచ్​ను.. లఖ్​నవూ వేదికగా ఇంగ్లాండ్​తో పోటీపడనుంది.

ఈ మ్యాచ్‌కు వారం రోజుల బ్రేక్ దొరకడం, దసరా పండగ రావడం వల్ల టీమ్​ ఇండియాకు రెండు రోజుల సెలవులు ఇచ్చినట్లు ప్రచారం‌ జరిగింది. కానీ న్యూజిలాండ్‌తో విజయానంతరం భారత జట్టు ప్లేయర్స్ అంతా ధర్మశాల్లోనే ఉండిపోయారు. సెలవలు తీసుకొని ఇంటికి వెళ్లడానికి ప్లేయర్స్​ నిరాకరించినట్లు సమాచారం అందింది. ధర్మశాలను వీడేందుకు విముఖత వ్యక్తం చేశారట. మరో రెండు రోజుల పాటు ధర్మశాల్లోనే ఉండి హిమాలయాల అందాలను ఆస్వాదించాలని అనుకుంటున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

Team India Dharamshala : ముందస్తు షెడ్యూల్ ప్రకారం టీమ్​ఇండియా సోమవారం ధర్మశాల నుంచి బయలుదేరాలి. కానీ ప్లేయర్స్​ విజ్ఞప్తి చేయడంతో ప్రయాణాన్ని రిషెడ్యూల్ చేశారని సదరు అధికారి వెల్లడించారు. "టీమ్​ఇండియా ఈ రోజు ప్రయాణం చేయలేదు. మరో రెండు రోజుల పాటు ధర్మశాలలోనే ఉంటుంది. లఖ్​నవూ వేదికగా జరిగే నెక్ట్స్​ మ్యాచ్ ప్రిపరేషన్స్​ ముందు ప్లేయర్స్​ విరామం తీసుకోనున్నారు." అని ఆ అధికారి తెలిపారు.

కాగా, దసరా పండగ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌తో పాటు ఇతర ఆటగాళ్లు ఇంటికి వెళ్లనున్నారని నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆటగాళ్లు మనసు మార్చుకుని ధర్మశాలలోనే ఉండిపోయినట్లు తాజాగా కథనాలు వస్తున్నాయి. ఇకపోతే ఈ వరల్డ్ కప్​లో ఒక్క టీమ్​ఇండియానే 9 మ్యాచ్‌లను 9 వేదికల్లో ఆడనుంది. వేల కిలోమీటర్లు జర్నీ చేయడం ప్లేయర్స్​కు సవాల్‌గా మారింది. అందుకే ఆటగాళ్ల పనిభారాన్ని.. దృష్టిలో పెట్టుకుని టీమ్​ మేనేజ్‌మెంట్ నిర్ణయాలు తీసుకుంటోంది.

Virat Kohli Centuries : జస్ట్​ మిస్​.. కోహ్లీ సెంచరీలు చేజార్చుకున్న సందర్భాలు ఎన్నో తెలుసా?

Bishan Singh Bedi Dies : ప్రముఖ మాజీ క్రికెటర్​ బిషన్ సింగ్ బేడీ మృతి.. ప్రధాని మోదీ-అమిత్​ షా సంతాపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.