ODI World Cup 2023 Srilanka VS Australia : ప్రస్తుతం వరల్డ్ కప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ప్రారంభమై దాదపు పది రోజులు అయిపోయింది. సెంచరీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. అయితే ఈ ప్రపంచకప్‌లో నెక్ట్స్ జరగబోయేది 14వ మ్యాచ్. ఆస్ట్రేలియా - శ్రీలంక మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ప్రస్తుత టోర్నీలో ఖాతా తెరవలేదు. తలో రెండు మ్యాచులు ఆడాయి కానీ ఒక్క దాంట్లో కూడా నెగ్గలేదు. ఈ నేపథ్యంలో లంక జట్టుతో పాటు ఆసీస్‌లో ఏ ప్లేయర్స్‌పై ఆశలు ఉన్నాయో తెలుసుకుందాం..
1. కుశాల్ మెండిస్.. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన కుశాల్ మెండిస్.. రీసెంట్గా జరిగిన ఆసియా కప్‌లో తన జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఎక్కువ సేపు క్రీజులో నిలిచి ఇన్నింగ్స్ ఆడటంలో ఇతను ఎక్స్పర్ట్. చాలా రోజులుగా లంక టీమ్‌కు ఆడుతూ.. మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాడు. ఇప్పటిదాకా 114 వన్డేల్లో 3,413 పరుగులు సాధించాడు. మెండిస్ యావరేజ్ 32.15, స్ట్రైక్ రేట్ 84.44 గా ఉంది. ఈ ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ అద్భుతంగా అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్నాడు. ఓ సెంచరీ కూడా బాదాడు. ఆడిన రెండు మ్యాచుల్లో 76, 122 పరుగులు చేశాడు. అసలీ ప్రపంచకప్‌లో శ్రీలంకకు ఆశ కుశాల్ మెండిసే. తొలి రెండు మ్యాచ్‌లో ఆ జట్టు ఓడినా.. చివరి వరకు పోరాడిందంటే కారణం కుశాల్. మున్ముందు మ్యాచ్‌ల్లోనూ అతడు ఇలాగే చెలరేగాలని లంక కోరుకుంటోంది.
-
🚨 Team Updates:
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Kusal Mendis was taken to the hospital after the player suffered cramps upon returning from the field after his brilliant knock of 122 runs from 77 balls in the ongoing game vs. Pakistan.
Dushan Hemantha is on the field for Mendis, while Sadeera Samarawickrama… pic.twitter.com/yku4iLeJKe
">🚨 Team Updates:
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 10, 2023
Kusal Mendis was taken to the hospital after the player suffered cramps upon returning from the field after his brilliant knock of 122 runs from 77 balls in the ongoing game vs. Pakistan.
Dushan Hemantha is on the field for Mendis, while Sadeera Samarawickrama… pic.twitter.com/yku4iLeJKe🚨 Team Updates:
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 10, 2023
Kusal Mendis was taken to the hospital after the player suffered cramps upon returning from the field after his brilliant knock of 122 runs from 77 balls in the ongoing game vs. Pakistan.
Dushan Hemantha is on the field for Mendis, while Sadeera Samarawickrama… pic.twitter.com/yku4iLeJKe
2. దాసున్ శనక.. శ్రీలంక కెప్టెన్ అయిన దాసున్ శనక.. ఈ టీమ్‌లో ప్రాముఖ్యం కలిగిన ఆటగాళ్లలో ఒకడు. తన నాయకత్వంతో జట్టును నడిపించడమే కాకుండా.. బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ రాణిస్తాడు. మరోవైపు ఫినిషర్ పాత్రనూ పోషించగలడు. శనక 69 మ్యాచుల్లో 1104 పరుగులు సాధించాడు. 5.72 ఎకానమీతో 27 వికెట్లనూ తీశాడు. ఈ ప్రపంచకప్‌లో వికెట్లు తీయలేదు కానీ.. పరుగులు మంచి సాధించాడు. ఆడిన రెండు మ్యాచుల్లో 68, 12 పరుగులు చేశాడు.
3. ధనంజయ డిసిల్వా.. శ్రీలంక జట్టులో బెస్ట్ ఆల్ రౌండర్. ఇటు బ్యాట్‌తో అటు బాల్‌తోనూ రాణించగలడు. బౌలింగ్‌లో తన స్వింగ్‌తో, బ్యాటింగ్‌లో తన బ్రిలియంట్ హిట్టింగ్తో ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచగలడు. ఇప్పటిదాకా 84 వన్డేలాడిన డిసిల్వా.. 1761 పరుగులు చేశాడు. 44 వికెట్లు పడగొట్టాడు. కానీ ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో 11, 25 పరుగులు మాత్రమే చేశాడు. నెక్ట్స్ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో..
4. మతిశా పతిరన.. యార్కర్ కింగ్ మలింగను పోలిన బౌలింగ్ యాక్షన్‌తో జూనియర్ మలింగగా పేరు తెచ్చుకున్నాడు ఇతడు. తన పదునైన యార్కర్లతో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడతాడు.. ఇతడికి కూడా ఇండియన్ పిచ్‌లపై ఆడిన అనుభవం ఎక్కువగానే ఉంది. తీక్షణతో పాటే పతిరన కూడా చెన్నై తరఫునే ఆడాడు. ఐపీఎల్లో ఆ జట్టుకు కీలక బౌలర్‌గా సేవలందించాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఒక వైపు పరుగులు ఆపుతూ మరోవైపు వికెట్లు పడగొట్టాడు. ఇతను తన కెరీర్లో ఇప్పటివరకు 12 వన్డేలు ఆడి 17 వికెట్లు పడగొట్టాడు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో రెండు మ్యాచులు ఆడి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 5, 1నాటౌట్ పరుగులు మాత్రమే చేశాడు. 2 వికెట్లు పడగొట్టాడు. మరి ఆస్ట్రైలియాపై ఎలా రాణిస్తాడో చూడాలి..
5. మహీశ్ తీక్షణ.. ఈ ఆఫ్ స్పిన్నర్ లంక టీమ్‌లోని కీలక ప్లేయర్స్‌లో ఒకడు. స్టార్ ప్లేయర్స్ కూడా ఇతడి స్పిన్ ముందు బోల్తా పడుతుంటారు. పాత బంతితోనే కాకుండా.. కొత్త బంతితోనూ వికెట్లు తీయగల సామర్థ్యం ఇతడిది. వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులను ఆపగలడు. ఇతడికి భారత మైదానాల్లో ఆడిన అనుభవం చాలా ఎక్కువ. ఐపీఎల్లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ఇప్పటి వరకు ఇతడు 28 వన్డేలాడి 45 వికెట్లు పడగొట్టాడు. ఇతడి ఎకానమీ 4.50 గా ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఇతడిపై కూడా మంచి ఆశలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. పరుగుల ఖాతా తెరవలేదు. ఒక్క వికెట్ తీశాడు.
ఇకపోతే ఈ ప్లేయర్సే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో లంకలో ఉన్న పథుమ్ నిస్సంక(0, 51) సమరవిక్రమార్క(23, 108) చరిత్ర అసలంక(79,1).. ఒక మ్యాచ్‌లో ఓడిపోతే మరో మ్యాచ్‌ల రాణించారు. బౌలర్లు మొత్తంగా తేలిపోతున్నారు. జట్టు సమిష్టిగా రాణించలేక చతికిలపడుతోంది. కాబట్టి అందరూ కలిసి చెలరేగితేనే ఆస్ట్రేలియాపై గెలిచి ఖాతా తెరవచ్చు.
-
A wet and wild night against the Dutch!
— Cricket Australia (@CricketAus) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Mitch Starc took a hat-trick, Steve Smith got a 50 and only 37.2 overs were possible due to a bucket loads of rain! #CWC23
Our final warm up is against Pakistan on Tuesday. pic.twitter.com/AJBaHn7R2Q
">A wet and wild night against the Dutch!
— Cricket Australia (@CricketAus) September 30, 2023
Mitch Starc took a hat-trick, Steve Smith got a 50 and only 37.2 overs were possible due to a bucket loads of rain! #CWC23
Our final warm up is against Pakistan on Tuesday. pic.twitter.com/AJBaHn7R2QA wet and wild night against the Dutch!
— Cricket Australia (@CricketAus) September 30, 2023
Mitch Starc took a hat-trick, Steve Smith got a 50 and only 37.2 overs were possible due to a bucket loads of rain! #CWC23
Our final warm up is against Pakistan on Tuesday. pic.twitter.com/AJBaHn7R2Q
ఇక ఆసీస్ విషయానికొస్తే.. గత ఎనిమిది వన్డేల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. పైగా దక్షిణాఫ్రికా చేతిలో నాలుగు పరాభవాలను ఎదుర్కొంది. ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి అందుకుంది. ఒకప్పుడు భీకరంగా చెలరేగి మిగిలిన జట్లను చివురుటాకులా వణించిన ఆస్ట్రేలియానేనా ఇలా ఆడేది అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఉన్నట్టుండి బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం, సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం ఆ జట్టుకు మరింత బలహీనతగా మారింది. ముఖ్యంగా ఓపెనర్లు సరైన ఆరంభాలను అస్సలు ఇవ్వలేకపోతున్నారు. వార్నర్ స్థిరంగానే ఆడుతున్నా.. మిచెల్ మార్ష్‌లో అస్సలు స్థిరత్వం లేదు. పేసర్లు ఎక్కువ పరుగులు ఇచ్చేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తేలిపోతున్నాడు. ఇవన్నీ ఆసీస్‌ను బాగా దెబ్బ తీస్తోంది. ముఖ్యంగా ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకోవాలి. ముఖ్య క్యాచ్‌లను వదిలేస్తున్నారు. మెరుగుపరుచుకోకపోతే.. ఆ జట్టుకు మన్ముందు మరిన్ని చేదు అనుభవాలు తప్పవు. చూడాలి మరి లంకపై ఎలా ఆడుతుందో..
World Cup 2023 Records : ప్రపంచకప్‌లో రికార్డుల మోత.. రికార్డుల రారాజు కెప్టెన్ హిట్‌మ్యానే!
Ind Vs Pak World Cup 2023 : టీమ్ఇండియా మైండ్‌గేమ్.. పాక్ జట్టును ఉచ్చులోకి లాగిందిలా!