ODI World Cup 2023 IND VS PAK : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా టీమ్ ఇండియాతో జరుగుతున్న హై ఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవరల్లో ఇన్ని పరుగులు చేసి ఆలౌట్ అయింది. దాయాది జట్టు కెప్టెన్ బాబర్ అజామ్(58 బంతుల్లో 50; 7x4) హై స్కోరర్. మహ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 49; 7 x4), ఇమామ్ ఉల్ హక్(38 బంతుల్లో 36 ; 6x4), అబ్దుల్లో షాహిక్(24 బంతుల్లో 20; 3x4) పరుగులు చేశారు. సౌద్ షకీల్(6), ఇఫ్టీఖర్ అహ్మద్(4), షాదబ్ ఖాన్(2), మహ్మద్ నవాజ్(4), హసన్ అలీ(12) నామమాత్రపు స్కోర్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ వికెట్లు తీశారు.
వారిద్దరే.. పాక్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కు అబ్దుల్లా షెఫీక్-ఇమామ్ కలిసి 41 పరుగులు జోడించారు. అయితే వీరి జోడీని సిరాజ్ విడగొట్టాడు. అబ్దుల్లా తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే.. ఇమామ్‌ను తమ అద్భుతమైన బంతితో హార్దిక్ బోల్తా కొట్టించాడు. అనంతరం భారత్‌పై మంచి రికార్డు కలిగిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ - రిజ్వాన్ క్రీజ్‌లోకి పాతుకుపోయేందుకు ప్రయతించారు. మూడో వికెట్‌కు 82 పరుగులను నమోదు చేశారు. దీంతో 29 ఓవర్లకు పాక్ 150/2 స్కోరుతో నిలిచింది. అయితే ఈ జోడీని మళ్లీ సిరాజే విడగొట్టాడు. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న బాబర్‌ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ పంపాడు.
37 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు..
బాబర్ అజామ్‌ను ఔట్ చేసిన తర్వాత భారత బౌలర్లు మరింత రెచ్చిపోయి ఆడారు. ఒకే ఓవర్‌లో షకీల్, ఇఫ్తికార్‌ను కుల్దీప్ ఔట్ చేశాడు. షకీల్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న టీమ్ఇండియాకు అనుకూలంగా ఫలితం దక్కింది. ఆ తర్వాత ఇఫ్తికార్‌ను కుల్‌దీప్ బౌల్డ్ చేశాడు. అనంతరం మరికాసేపటికే కీలకమైన రిజ్వాన్‌ను, షాదాబ్ ఖాన్‌ను తన వరుస ఓవర్లలో బుమ్రా కూడా క్లీన్‌బౌల్డ్ చేసేశాడు. కేవలం ఐదు ఓవర్ల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోయి పాక్ చతికిలపడే దిశగా వెళ్లిపోయింది. మహమ్మద్ నవాజ్ (4), హసన్ అలీ (12) క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో 29.3 ఓవర్లకు 154/2 స్కోరుతో ఉన్న పాకిస్థాన్ జట్టు 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం 37 పరుగుల వ్యవధిలో చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది.
-
Innings Break!
— BCCI (@BCCI) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A cracker of a bowling performance from #TeamIndia! 👌 👌
Jasprit Bumrah, Kuldeep Yadav, Ravindra Jadeja, Hardik Pandya & Mohd. Siraj share the spoils with 2️⃣ wickets each!
Scorecard ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/omDQZnAbg7
">Innings Break!
— BCCI (@BCCI) October 14, 2023
A cracker of a bowling performance from #TeamIndia! 👌 👌
Jasprit Bumrah, Kuldeep Yadav, Ravindra Jadeja, Hardik Pandya & Mohd. Siraj share the spoils with 2️⃣ wickets each!
Scorecard ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/omDQZnAbg7Innings Break!
— BCCI (@BCCI) October 14, 2023
A cracker of a bowling performance from #TeamIndia! 👌 👌
Jasprit Bumrah, Kuldeep Yadav, Ravindra Jadeja, Hardik Pandya & Mohd. Siraj share the spoils with 2️⃣ wickets each!
Scorecard ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/omDQZnAbg7
మ్యాచ్‌ను వీక్షించిన అమిత్ షా... ఇకపోతే నరేంద్రమోదీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేంద్రమంత్రి అమిత్ షా సందడి చేశారు. మ్యాచ్‌ను ప్రత్యేక్షంగా వీక్షించారు. నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు గుజరాత్‌లో ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు గుజరాత్ వెళ్లిన ఆయన.. ఈ మ్యాచ్‌ను కూడా లైవ్‌లో చూశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.