ODI World Cup 2023 : భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. అంటే మరో 46 రోజుల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్పటికే అన్ని జట్లూ సంసిద్ధమవుతున్నాయి. అలాగే కొన్ని టీమ్‌లు తమ ప్రాథమిక జట్లనూ కూడా అనౌన్స్ చేశాయి. ఐసీసీ, బీసీసీఐ కూడా మ్యాచ్‌ల రీషెడ్యూల్‌ను కూడా ఖరారు చేసేశాయి. ఇలాంటి సమయంలో ఐసీసీ, బీసీసీఐకి మరోసారి తలనొప్పి వచ్చి పడింది. రీషెడ్యూల్ చేసిన మ్యాచుల్లో మరిన్ని మార్పులు చేయాలని హెచ్‌సీఏ.. ఐసీసీని కోరినట్లు తెలిసింది.
ODI World Cup 2023 Hyderabad Venue : ఉప్పల్ వేదికగా మూడు వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అయితే ఇందులో టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌లు అయితే లేవు. అక్టోబర్ 6న పాకిస్థాన్ - నెదర్లాండ్స్, అక్టోబర్ 9న న్యూజిలాండ్ - నెదర్లాండ్స్, అక్టోబర్ 10న పాకిస్థాన్ - శ్రీలంక జట్ల మధ్య పోరు జరగనుంది. అయితే.. వరుస రోజుల్లో మ్యాచ్‌ల నిర్వహణపై హైదరాబాద్ పోలీసులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన ఆందోళనను వ్యక్తం చేశారట. అంత సెక్యూరిటీని కల్పించడం ఇబ్బందిగా అవుతుందని అన్నారట. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ సంఘం బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ODI World Cup 2023 Hyderabad Schedule : వరుస రోజుల్లో రెండు మ్యాచులను నిర్వహించడం వల్ల భద్రత కల్పించడం కష్టంగా మారుతుందని హైదరాబాద్ పోలీస్ విభాగం ఆందోళన వ్యక్తం చేసిందని వార్తలు వస్తున్నాయి. మొదటి షెడ్యూల్ ప్రకారం పాకిస్థాన్ - శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 12న జరగాలి. కానీ, అహ్మదాబాద్ వేదికగా నిర్వహించాల్సిన టీమ్ఇండియా - పాక్ మ్యాచ్‌ను అక్టోబర్ 14కి రీషెడ్యూల్ చేశారు. దీంతో పాకిస్థాన్‌కు కాస్త సమయం ఇవ్వడానికి లంకతో జరగాల్సిన మ్యాచ్‌ను అక్టోబర్ 10కి మార్చుతూ ఖరారు చేశారు. అలాగే కోల్‌కతా వేదికగా నవంబర్ 12న జరగాల్సిన పాకిస్థాన్ - ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా నవంబర్ 11న నిర్వహించేలా రీషెడ్యూల్ చేశారు. మరి హైదరాబాద్ పోలీసులు, హెచ్‌సీఏ చేసిన విజ్ఞప్తిపై బీసీసీఐ, ఐసీసీ ఎలా స్పందిస్తాయో చూడాలి..
ODI World Cup 2023 Venues : కాగా, అక్టోబర్ 8న టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో పోటీపడనుంది. ఇప్పటికే వరల్డ్ కప్ మ్యాచుల టికెట్ల విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమైంది. ఆగస్ట్ 25 నుంచి అధికారికంగా విక్రయాలు జరుగుతన్నాయి. మొదటిసారి భారత్ పూర్తిస్థాయి టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇండియావైడ్‌గా పది వేదికల్లో వరల్డ్ కప్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
వరల్డ్ కప్ హీరో రిటైర్మెంట్ వెనక్కి.. ఇంగ్లాండ్ వన్డే జట్టుకు ఎంపికైన బెన్ స్టోక్స్
క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఏకంగా 515 భారీ స్కోర్.. 450 పరుగుల తేడాతో విజయం..