ODI World Cup 2023 Gerald Coetzee : తలకు - చేతికి బ్యాండ్.. బుల్లెట్ వేగం, వైవిధ్యంతో బంతులు సంధించడం.. వికెట్ పడితే సంబరాలు చేసుకోవడం.. ఈ కుర్రాడిని చూస్తే ఠక్కున సౌతాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్‌ను గుర్తుకొస్తాడు. అతడే 23 ఏళ్ల గెరాల్డ్ కొయిట్జీ. అతడు ఆరాధించేది స్టెయిన్‌నే! సఫారీ క్రికెట్లో దూసుకొచ్చిన ఈ పేసర్.. మెరుపు వేగంతో ఆడుతూ జూనియర్ స్టెయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై మూడు వికెట్లు తీసి అదరగొట్టిన అతడు... శ్రీలంకతో మ్యాచ్‌లోనూ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 3 వికెట్లు పడగొట్టాడు. అయితే కొయిట్జీ కేవలం బౌలర్‌గా మాత్రమే కాదు అతడు లోయర్‌ఆర్డర్‌లో హార్డ్ హిట్టింగ్ చేసే బ్యాటర్ కూడా రాణిస్తున్నాడు.
స్విమ్మర్‌గా మొదలెట్టి.. బ్లూమ్ ఫౌంటీన్కు చెందిన కొయిట్జీ మొదట క్రికెటర్ అవుదామని అనుకోలేదట. మొదట స్విమ్మింగ్ చేసేవాడు. ఆ తర్వాత సోదరుడు క్రికెటర్ కావడంతో.. బౌలింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. వాస్తవానికి స్టెయిన్‌తో పాటు మోర్నీ మోర్కెల్‌ను అంటే కూడా కొయిట్జీ బాగా ఇష్టం. దేశవాళీలో అతడు 28.10 యావరేజ్‌తో 59 వికెట్లు తీసిన అతడు సెలక్టర్ల దృష్టిలో పడి.. . 2018 అండర్-19 వరల్డ్ కప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే ఛాన్స్‌ను దక్కించుకున్నాడు. ప్రస్తుత టోర్నీలోనూ అవకాశం అందుకుని మంచి గా రాణిస్తున్నకాడు.
150 కి.మీ వేగంతో.. స్థిరంగా 150 కి.మీ వేగంతో బంతులను సంధించగలడు. కేవలం 13 దేశవాళీ మ్యాచ్‌లతోనే నేషనల్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2022 డిసెంబర్లో ఆస్ట్రేలియాపై సిరీస్‌లో జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. కానీ ఈ సిరీస్‌లో తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌పై సిరీస్‌తో టెస్ట్ అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే 5 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటివరకు 2 టెస్టు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు దక్కించుకున్నాడు. ఇదే ఏడాది మార్చిలో వెస్టిండీస్‌పైనే కెరీర్లో వన్డే అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో 20.90 యావరేజ్‌తో 11 వికెట్లు తీశాడీ పేసర్. మొత్తంగా 10 వన్డేల్లో 21 వికెట్లను దక్కించుకున్నాడు. 3 టీ20 ఆడి 3 వికెట్లు దక్కించుకున్నాడు.
టెస్టు క్రికెట్టే అంటే ఎక్కువ.. కొయిట్జీ.. వేగానికి వైవిధ్యాన్ని జోడిస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతాడు. ఎంత స్పీడ్‌గా బౌలింగ్ వేయగలడో.. అంతే తెలివిగా స్లో బౌలింగ్‌తో మాయ కూడా చేస్తాడు. బుల్లెట్ యార్కర్లను సంధించగలడు. భయపెట్టే బౌన్సర్లను ప్రయోగిస్తుంటాడు. ఇంగ్లాండ్‌తో వరల్డ్ కప్ మ్యాచ్‌లోనూ అతడు ఈ రకంగానే బంతులు సంధించి వికెట్లు తీశాడు. ఈ తరం కుర్రాళ్లంతా టీ20 క్రికెట్ వెనక పడుతుంటే కొయిట్జీ మాత్రం టెస్టు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమట. కొయిట్జీ ఇదే జోరును కొనసాగిస్తే.. స్టెయిన్ తరహాలో దూకుడైన పేసర్‌గా ఎప్పటికీ నిలిచిపోవడం ఖాయమనే చెప్పాలి.
World Cup 2023 SA Vs BAN : సౌతాఫ్రికా ఆల్‌రౌండ్ షో.. బంగ్లాపై ఘన విజయం.. మహ్మదుల్లా సెంచరీ వృథా