ETV Bharat / sports

ODI World Cup 2023 England Team : ఫేవరెట్​గా డిఫెండింగ్​ ఛాంపియన్​.. అదొక్కటే మైనస్​

Odi World Cup 2023 England Team : వన్డే వరల్డ్ కప్​ మరో మూడు రోజుల్లో ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్​ ఇంగ్లాండ్​ - న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్​ జట్టు బలాబలాలు తెలుసుకుందాం..

ODI World Cup 2023 England Team : ఫేవరెట్​గా డిఫెండింగ్​ ఛాంపియన్​..  అదొక్కటే మైనస్​
ODI World Cup 2023 England Team : ఫేవరెట్​గా డిఫెండింగ్​ ఛాంపియన్​.. అదొక్కటే మైనస్​
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 2:59 PM IST

ODI World Cup 2023 England Team : ఆస్ట్రేలియా జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు కంగారు జట్టుతో తలపడాలంటే ప్రత్యర్థి జట్లు భయపడేవి! అయితే ఇప్పుడు దాదాపుగా అలాంటి భయాన్నే కలిగిస్తున్న టీమ్​ ఇంగ్లాండ్‌. దూకుడుగా ఆడుతూ.. ప్రత్యర్థులను భయపెడుతోంది. అదే దూకుడైన ఆటతో 2019లో ఛాంపియన్​గా నిలిచి వన్డే ప్రపంచకప్‌ కలను నేరవేర్చుకుంది. ఇప్పుడు మరోసారి ఫేవరెట్​ జట్లలో ఒకటిగా బరిలోకి దిగబోతుంది.

సొంతగడ్డపై భారీ అంచనాలతో టీమ్ ​ఇండియా వరల్డ్ కప్​ బరిలోకి దిగబోతుండగా.. భారత్ దిగ్గజ ఆటగాడు గావస్కర్‌ టీమ్​ఇండియాను కాదని ఇంగ్లాండ్‌నే టైటిల్‌ ఫేవరెట్‌గా పేర్కొనడం గమనార్హం. గత సారి కూడా ఎక్కువ మంది ఆ టీమ్​నే ఫేవరెట్‌గా పేర్కొనగా.. అంచనాలను నిలబెట్టుకుంటూ కప్​ను ముద్దాడింది ఇంగ్లిష్‌ జట్టు. వరల్డ్ కప్​ వైఫల్యం తర్వాత జట్టులో సమూల మార్పులు చేసిన ఆ జట్టు.. ప్రస్తుతం దూకుడైన ఆటతీరుతో మేటి జట్టుగా ఎదిగింది. 2019 విజయం తర్వాత నుంచి అదే ఊపును కొనసాగిస్తూ దూసుకుపోతోంది.

England Team strengths : జట్టు బలాలు.. ఇతర ఏ జట్టుకు లేనంత లోతైన బ్యాటింగ్‌, ఆల్‌రౌండ్‌ బలం, దూకుడైన ఆటతీరు ఇంగ్లాండ్​కు కలిసొచ్చే అంశాలు. లోయర్ ఆర్డర్​లో ఆడే సామ్‌ కరన్‌, విల్లీ కూడా మంచిగా బ్యాటింగ్​లో రాణించగలరు. మలన్‌, బెయిర్‌స్టో, రూట్‌, బ్రూక్‌, లివింగ్‌స్టన్‌, స్టోక్స్‌, మొయిన్‌ అలీ, బట్లర్‌.. ఇలా లోతైన బ్యాటింగ్‌ బలం ఆ జట్టుకుంది.

టెస్టు బ్యాటర్‌ రూట్‌ కూడా ఈ మధ్య దూకుడుగా బాగా పెంచేశాడు. వరల్డ్​ కప్​ కోసం స్టోక్స్‌ తిరిగి జట్టులోకి రావడం కూడా ఆ టీమ్​కు బలం ఇంకాస్త పెరిగింది. ఎక్కువ మంది ఆల్‌ రౌండర్లు అందుబాటులో ఉండటం వల్ల.. వారిలో కొందరు రాణించలేకపోయినా మరి కొందరు అందుకుంటున్నారు. ఇవే ఈ జట్టు ప్రధాన బలాలు.

England Team Weakness : బలహీనతలు.. టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు 'బజ్‌బాల్‌'ను అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో వన్డేల్లోనూ అనుసరించడం.. కొన్నిసార్లు చేటు చేస్తోందనే చెప్పాలి. కీలక మ్యాచ్‌ల్లో ఇది నష్టం చేకూర్చొచ్చు. ఇక బౌలింగ్​లో ప్రత్యామ్నాయాలు కూడా చాలానే ఉన్నప్పటికీ.. ప్రత్యర్థులను బెంబేలెత్తించే ఏస్‌ బౌలర్‌ లేకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. భారత్ పిచ్​లపై సరైన నాణ్యమైన స్పిన్నర్లు ఎదురుపడితే.. ఇంగ్లాండ్‌ తట్టుకుని నిలబడగలదా అన్నది చెప్పడం కాస్త కష్టమే..

జట్టు: బట్లర్‌ (కెప్టెన్‌), బెయిర్‌స్టో, బ్రూక్‌, మలన్‌, రూట్‌, లివింగ్‌స్టన్‌, స్టోక్స్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, విల్లీ, వోక్స్‌, అట్కిన్సన్‌, రషీద్‌, టాప్లీ, వుడ్‌.

Indian Origin Cricketers In World Cup 2023 : వాళ్లూ మనోళ్లే.. ప్రత్యర్థి జట్ల తరఫున ఆడే భారత ప్లేయర్స్​ వీరే

ICC Trophy Winners History : 25ఏళ్లుగా సౌతాఫ్రికా.. 13ఏళ్లుగా టీమ్​ఇండియా.. ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూపులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.