ETV Bharat / sports

ఒకేసారి 101,566 మంది ప్రేక్షకులు.. నరేంద్ర మోదీ స్టేడియం గిన్నిస్​ రికార్డ్! - narendra modi stadium Guinness Book of Records

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్​ స్టేడియం అయిన అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం.. గిన్నిస్​ బుక్​లో చోటు సంపాదించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా తన ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

narendra modi stadium Guinness Record
narendra modi stadium Guinness Record
author img

By

Published : Nov 27, 2022, 6:46 PM IST

అహ్మదాబాద్​లోని నరేంద్ర మోదీ స్టేడియం గిన్నిస్​ బుక్​లో చోటు సంపాదించింది. 2022 ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్​లో అత్యధికంగా 101,566 మంది ప్రేక్షకులు హాజరైనందుకు ఈ స్టేడియం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఆదివారం తెలిపారు. ఇంతకుముందు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొతెరాగా పిలిచే ఈ స్టేడియానికి 110,000 సామర్థ్యం ఉంది. అయితే ఇది మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​ సామర్థ్యం కన్నా పెద్దది. దానికి.. అధికారిక లెక్కల ప్రకారం 1,00,024 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. నరేంద్ర మోదీ స్టేడియం సామర్థ్యం అంతకంటే 10,000 మంది ఎక్కువ.

'ఈ స్టేడియం గిన్నిస్​ రికార్టులో చోటు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఎంతో గర్వకారణం. ఇది సాధ్యమయ్యేలా చేసిన మా అభిమానులకు కృతజ్ఞతలు' అని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్వీట్​ చేశారు.

  • Extremely delighted & proud to receive the Guinness World Record for the largest attendance at a T20 match when 101,566 people witnessed the epic @IPL final at @GCAMotera's magnificent Narendra Modi Stadium on 29 May 2022. A big thanks to our fans for making this possible! @BCCI https://t.co/JHilbDLSB2

    — Jay Shah (@JayShah) November 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి : సంజూ శాంసన్​ను జట్టులోకి తీసుకోలేదు.. కారణం ఇదే!

రెండో వన్డే వరుణుడిదే.. భారత్‌కు కలిసిరాని సిరీస్​.. 1-0 ఆధిక్యంలో కివీస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.