ఆరంభ మహిళా ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది ముంబయి ఇండియన్స్. ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గెలిచింది. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి జట్టు.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబయి బ్యాటర్లలో నాట్‌సీవర్ బ్రంట్ అర్థ శతకంతో విజృంభించింది. 55 బంతుల్లో 7 ఫోర్లతో 60 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా 39 బంతుల్లో 5 బౌండరీలు చేసి 37 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. హెయిలీ మాథ్యూస్, అమీలా కెర్ బౌలింగ్‌లో అదరగొట్టినా బ్యాటింగ్‌లో మాత్రం రాణించలేకపోయారు. 12 బంతుల్లో మూడు ఫోర్లతో 13 పరుగులు మాత్రమే చేసింది మాథ్యూస్.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. దిల్లీకి ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ వాంగ్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి అమీలా కెర్‌కు క్యాచ్ ఇచ్చింది. కాగా, షఫాలీ 4 బంతుల్లో(1×4,1×6)తో 11 పరుగులకే పెవిలియన్ చేరింది. తర్వాత క్రీజులోకి వచ్చిన క్యాప్సీ(0)తో పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగింది. అనంతరం మరో ఓపెనర్, కెప్టెన్ మెగ్‌లానింగ్ రోడ్రిగ్స్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసినా.. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాంగ్ బౌలింగ్‌లోనే అమన్‌జ్యోత్ కౌర్‌కు క్యాచ్ ఇచ్చి రోడ్రిగ్స్ కూడా పెవిలియన్ బాట పట్టింది. ఆ తర్వాత జట్టు స్కోరు 73 పరుగుల వద్ద మరిజన్నె కప్(18) అమీలా కెర్ బౌలింగ్‌లో భాటియాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.
ఆ తర్వాతి ఓవర్‌లోనే యాస్తికా భాటియా వేసిన 12.4 బంతికి మెగ్‌లానింగ్ రన్‌అవుట్ అయ్యింది. దీంతో దిల్లీ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్లేయర్లు తనియా భాటియా, అరుంధతి రెడ్డి కూడా డకౌటయ్యారు. జోనా సేన్(2), మిన్ను మని(1) పరుగులు చేశారు. ఇలా ఒకరివెనుక ఒకరు రెండంకెల స్కోర్ కూడా చేయకుండానే వెనుదిరగడంతో దిల్లీ కనీసం 100 స్కోరైనా చేస్తుందా అనే చర్చ మొదలైంది. ఇక చివర్లో షిఖా పాండే, రాధా యాదవ్‌లు కీలక ఇన్నింగ్స్ ఆడి 132 పరుగులతో దిల్లీ జట్టు పరువు నిలబెట్టారు. ముంబయి బౌలర్లలో వాంగ్, హెయిలీ మాథ్యూస్ చెరో 3 వికెట్లు తీయగా.. అమీలా కెర్ రెండు వికెట్లు పడగొట్టింది.
-
Tonight's gonna be a good good night 🏆💙#OneFamily #MumbaiIndians #AaliRe #WPL2023 #DCvMI #WPLFinal #ForTheW pic.twitter.com/qdN5Y7KYrA
— Mumbai Indians (@mipaltan) March 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tonight's gonna be a good good night 🏆💙#OneFamily #MumbaiIndians #AaliRe #WPL2023 #DCvMI #WPLFinal #ForTheW pic.twitter.com/qdN5Y7KYrA
— Mumbai Indians (@mipaltan) March 26, 2023Tonight's gonna be a good good night 🏆💙#OneFamily #MumbaiIndians #AaliRe #WPL2023 #DCvMI #WPLFinal #ForTheW pic.twitter.com/qdN5Y7KYrA
— Mumbai Indians (@mipaltan) March 26, 2023
ఇవీ చదవండి: