ETV Bharat / sports

కోచ్​కు ధోనీ స్వీట్​ వార్నింగ్​.. అడిగేవరకు సలహాలు ఇవ్వొద్దంటూ.. - chennai super kings

MS Dhoni: తాను అడిగేవరకు సలహాలు ఇవ్వొద్దని ఓ సహాయక కోచ్​ను పిలిచి మరీ చెప్పాడు చెన్నైసూపర్​ కింగ్స్​, పుణె జట్ల మాజీ సారథి ఎంఎస్ ధోనీ. అతడి అనుభవాన్ని ఆటగాళ్లు, ఇతర కోచ్​లతో మాత్రమే పంచుకోవాలని అన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

MS Dhoni
IPL
author img

By

Published : Mar 27, 2022, 11:27 AM IST

Updated : Mar 27, 2022, 2:10 PM IST

MS Dhoni: ఎంఎస్​ ధోనీ.. అంత గొప్ప నాయకుడిగా ఎలా ఎదిగాడో తన మొదటి సమావేశంలో తెలిసిందని 2016లో పుణెకు సహాయక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రసన్న అగోరమ్ వెల్లడించాడు. ధోనీ తనకు స్వాగతం పలుకుతూనే ఓ కీలక సూచన కూడా చేశాడని పేర్కొన్నాడు. "నాకు తొలిసారి మహేంద్ర సింగ్‌ ధోనీతో కలిసి పనిచేసే అవకాశం 2016లో వచ్చింది. మొదటి రోజే 'మనిద్దరం కాసేపు మాట్లాడుకుందాం' అని ధోనీ చెప్పాడు. కాఫీ తాగుతారా? అని అడిగి తెప్పించాడు" అని ప్రసన్న గుర్తుచేసుకున్నాడు.

MS Dhoni
ధోనీ

"మీకు చాలా అనుభవం ఉంది. అందుకే స్టీఫెన్ ఫ్లెమింగ్‌ మిమ్మల్ని తీసుకున్నాడు. మీతో పని చేయడం ఆనందంగా ఉంది. మీ వద్ద ఉన్న సమాచారం, స్ట్రాటజీకి సంబంధించిన వివరాలను కోచ్‌లతోపాటు ఆటగాళ్లకు ఇవ్వండి. స్ట్రాటజీ సమావేశాలకు ఆటగాళ్లు, కోచ్‌ వస్తారు. అయితే తాను (ధోనీ) వస్తానని మాత్రం ఆశించవద్దు. అంతేకాకుండా నేను అడిగేవరకు ఎలాంటి సలహాలు ఇవ్వొద్దు. అయితే ప్రతిదాన్నీ జీమెయిల్‌ రూపంలో కోచ్‌, ఆటగాళ్లతో కమ్యూనికేట్‌ అవ్వండి" అని ధోనీ చెప్పాడని ఆనాటి సంఘటనను ప్రసన్న గుర్తుకు తెచ్చుకున్నాడు.

ఇదీ చూడండి: 'తలా తిరిగొచ్చాడు'.. తొలి మ్యాచ్​లో ధోనీ అరుదైన రికార్డు

Last Updated : Mar 27, 2022, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.