ETV Bharat / sports

క్రికెట్ అకాడమీ పేరుతో రూ.15కోట్లు టోకరా- కోర్టుకెక్కిన ధోనీ - Arka sports academy

MS Dhoni 15 Crore Case: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, తన బిజినెస్ పార్ట్​నర్స్​పై క్రిమినల్ కేసు పెట్టాడు. వారి కారణంగా తను రూ.15 కోట్లు నష్టపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Ms dhoni 15 crore case
Ms dhoni 15 crore case
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 5:24 PM IST

Updated : Jan 5, 2024, 5:49 PM IST

MS Dhoni 15 Crore Case: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన బిజినెస్ పార్ట్​నర్లు మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్​పై రాంచిలో క్రిమినల్ కేసు పెట్టాడు. వీరిద్దరి వల్ల తను రూ.15 కోట్లు నష్టపోయినట్లు ధోనీ కంప్లైంట్​లో పేర్కొన్నాడు.

ఇదీ జరిగింది
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేందుకు 2017లో ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్​మెంట్​తో ధోనీకి ఒప్పందం కుదిరింది. అయితే ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్​మెంట్​లో భాగమైన మిహిర్ దివాకర్, సౌమ్య విశ్వాస్​ షరతులను పాటించడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా నిబంధనల ప్రకారం ఫీ, ఫ్రాంచైజీ లాభాల్లో ధోనీకి రావాల్సిన వాటా కూడా చెల్లించలేదు. దీనిపై ఆర్కా స్పోర్ట్స్​ మేనేజ్​మెంట్​కు ధోనీ 2021లో లీగల్ నోటీసులు పంపించాడు. కానీ, మేనేజ్​మెంట్​ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ధోనీ తాజాగా రాంచీ కోర్టును ఆశ్రయించాడు. ఆర్కా స్పోర్ట్స్​ కారణంగా రూ.15 కోట్లు నష్టపోయినట్లు విధి అసోసియేట్స్​ బాధ్యతలు చూసుకునే దయానంద్ సింగ్ పేర్కొన్నాడు. ఇక, దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న ధోనీ ఇటీవలే భారత్​కు తిరిగొచ్చారు.

  • MS Dhoni has filed a case of a fraud of 15 CRORES on Mihir Diwakar and Soumya Vishwas of Arka Sports and Management Limited.

    They promised him in 2017 that they would build cricket academies for him across the country, but failed to do so. pic.twitter.com/xrHKKFgflp

    — Flash (@F1ash369) January 5, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

MS Dhoni Defamation Case: భారత మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ ఇటీవల వార్తల్లో నిలిచారు. ధోనీ వేసిన పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ ఐపీఎస్​ అధికారికి మద్రాస్ కోర్టు గత డిసెంబర్​లో 15 రోజుల జైలు శిక్షను విధించింది. సంపత్​ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని నిర్ధరిస్తూ జస్టిస్​ ఎస్​ఎస్​ సుందర్​, జస్టిస్​ సుందర్​ మోహన్​తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ జరిగింది
2013లో ఐపీఎస్​ అధికారి సంపత్​ కుమార్​ జీ టీవీ ఛానల్​లో మాట్లాడుతూ ఐపీఎల్​ ఫిక్సింగ్​కు, క్రికెటర్​ మహేంద్ర సింగ్ ధోనీకి ముడిపెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధోనీ సంబంధిత టీవీ ఛానల్​తో పాటు అధికారి సంపత్​పై 2014లో పరువు నష్టం దావా వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, పరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. 17 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ కోర్టును ఆశ్రయించారు.

ధోనీకి పాక్​ నుంచి స్పెషల్ ఇన్విటేషన్ - 'క్రికెట్​ గురించే కాకుండా మరోసారి రావాలి'​

ధోనీ పరువు నష్టం కేసు- IPS అధికారికి 15 రోజులు జైలు శిక్ష

Last Updated : Jan 5, 2024, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.