Pakisthan Former Pacer Mohammed Sami: పాకిస్థాన్ మాజీ పేసర్ మహ్మద్ సమి ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు 160 కి.మీ వేగానికిపైగా బంతులేశానని గొప్పలు చెబుతున్నాడు. అయితే, అప్పుడు స్పీడ్‌గన్ వాటిని గుర్తించలేదట. తాజాగా ఓ స్థానిక ఛానల్‌తో మాట్లాడిన అతడు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమి కొన్నాళ్ల పాటు దిగ్గజ పేసర్, స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్‌తో కలిసి బౌలింగ్ చేశాడు. దీంతో అతడు పాక్ జట్టులో కొద్దికాలం ప్రధాన బౌలర్లలో ఒకడిగా రాణించాడు.
"నేనొక మ్యాచ్‌లో రెండు బంతుల్ని 160 కి.మీపైగా వేగంతో బౌలింగ్ చేశా. అందులో ఒకటి 162 కి.మీ వేగంతో పడింది. మరొకటి 164 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. కానీ, అప్పుడు స్పీడ్‌గన్ (బౌలింగ్ వేగాన్ని కొలిచే మెషీన్) పనిచేయడం లేదని సిబ్బంది చెప్పడం వల్ల ఆ బంతుల్ని లేక్కలోకి తీసుకోలేదు. అయితే, ప్రపంచ క్రికెట్‌లో 160 కి.మీ వేగంతో బంతులేసిన సందర్భాలు ఒకటో, రెండో మాత్రమే ఉంటాయి" అని సమి పేర్కొన్నాడు. కాగా, ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక వేగం నమోదు చేసింది అక్తర్ మాత్రమే. అతడు 2002లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161 కి.మీ వేగంతో ఒక బంతిని సంధించాడు.
ఇదీ చదవండి: IND VS PAK: 'పాక్‌కు బీసీసీఐ వ్యతిరేకం కాదు'