ETV Bharat / sports

'ద్రవిడ్​లా కనిపిస్తున్నాడు.. టీమ్​ఇండియా తర్వాతి కెప్టెన్ అతడే​' - ind vs sa

Rahul Dravid: క్రికెట్​లో రాహుల్​ ద్రవిడ్ ఒక లెజెండ్​. 'ది వాల్'​గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పుజారా నయావాల్​గా అవతరించినా ప్రస్తుతం ఫామ్​లేమితో తీవ్రంగా సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్​. ప్రస్తుత జట్టులోని ఓ ఆటగాడిని చూస్తుంటే తన మాజీ సహచరుడు రాహుల్​ ద్రవిడ్​ గుర్తుకొస్తున్నాడని చెప్పాడు.

Rahul Dravid
kl rahul
author img

By

Published : Dec 31, 2021, 3:48 PM IST

Rahul Dravid: టీమ్​ఇండియా ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ను చూస్తే మాజీ బ్యాటర్​​, ప్రస్తుత హెడ్​ కోచ్ రాహుల్​ ద్రవిడ్ గుర్తుకొస్తాడని చెప్పాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్​. అందుకు చాలా కారణాలనే ప్రస్తావించాడు. కేఎల్​ రాహుల్​ బ్యాటింగ్ స్టైల్​, స్లిప్​లో నమ్మదగిన ఫీల్డర్​, కాబోయే కెప్టెన్​.. ఈ లక్షణాలన్నీ ద్రవిడ్​ను తలపిస్తున్నాయని వివరించాడు. దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో అద్భుత శతకంతో జట్టుకు విజయాన్ని అందించిన కేఎల్​పై కొద్దిరోజులుగా ప్రశంసల జల్లు కురుస్తుంది.

kl rahul
కేఎల్ రాహుల్

"కేఎల్​ రాహుల్​ను చూస్తే రాహుల్ ద్రవిడ్​ గుర్తొస్తాడు. ఎప్పుడూ జట్టు కోసమే ఆడే నిస్వార్థమైన వ్యక్తి. అతడో ఓపెనర్, అదనపు వికెట్​కీపర్, లోయరార్డర్​​ బ్యాట్స్​మన్, నమ్మదగిన స్లిప్​ ఫీల్డర్​, ఆపదలో జట్టును ఆదుకునేవాడు, భవిష్యత్తులో కెప్టెన్​ కావడానికి అర్హత కలిగినవాడు."

- మహ్మద్ కైఫ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

kl rahul
ద్రవిడ్​తో కేఎల్​ రాహుల్

దక్షిణాఫ్రికా పర్యటనలో అటు బ్యాటుతో ఇటు బంతితో అదరగొడుతోంది కోహ్లీసేన. తొలి టెస్టులో కేఎల్​ రాహుల్​ (123) సెంచరీతో తొలి ఇన్నింగ్స్​లో 327 పరుగులు చేసింది టీమ్​ఇండియా. అనంతరం మహ్మద్ షమీ 5 వికెట్లతో విజృంభించగా సఫారీ జట్టు 197 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్​లో భారత్​-174, దక్షిణాఫ్రికా-191 చేశాయి. దీంతో 113 పరుగుల తేడాతో టీమ్​ఇండియా ఘనవిజయం సాధించింది. రాహుల్ ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు.

ఇదీ చూడండి: తరచూ ఆ బంతులకే కోహ్లీ ఔట్.. గావస్కర్ ఏమన్నాడంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.