ETV Bharat / sports

మహిళా క్రికెట్​లో మిథాలీ ఓ శిఖరం.. 23 ఏళ్ల కెరీర్​లో ఎన్నో రికార్డులు - మిథాలీ రాజ్​ క్రికెట్​

అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. భారత్‌లో మహిళా క్రికెట్‌కు ప్రాణం పోసి వేల మంది బాలికలను బ్యాట్‌తో క్రికెట్‌ మైదానానికి నడిపించిన మిథాలీరాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. పురుషుల క్రికెట్‌లో సచిన్‌తో సరిసమానమైన ఖ్యాతినార్జించిన మిథాలీ తన అద్భుత ఆటతీరుతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. రెండు దశాబ్దాల పాటు భారత మహిళల క్రికెట్‌ను శాసించిన, దిశా నిర్దేశం చేసిన, భవిష్యత్‌ వైపు నడిపించిన ఈ స్టార్‌ క్రికెటర్‌ 23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ ప్రస్థానానికి ముగింపు పలికారు..

mithali raj
మిథాలీ రాజ్
author img

By

Published : Jun 8, 2022, 7:43 PM IST

పదహారేళ్ల వయసులో బ్యాట్‌ పట్టి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిథాలీరాజ్‌.. 39 ఏళ్ల వయసులో తన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు. 22 గజాల క్రికెట్‌ పిచ్‌పై..23 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌కు సెలవు ప్రకటించారు. అద్భుత ఆటతీరుతో వర్థమాన క్రికెటర్లకు దిశానిర్దేశం చేసి భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఓ రూపు తీసుకొచ్చిన మిథాలీ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్నిరకాల ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. 23 ఏళ్ల పాటు భారత మహిళా క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన మిథాలీ.. ఈ సుదీర్ఘ క్రికెట్‌ ప్రయాణానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని ట్విట్టర్‌ వేదికగా వీడ్కోలు లేఖ విడుదల చేశారు. ఎన్నో రికార్డులను తన పేర లిఖించిన ఈ క్రికెట్‌ దిగ్గజం భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఓ రూపునిచ్చారు..

భారత్‌లో మహిళా క్రికెట్‌ను తీర్చిదిద్దడంలో తన పాత్ర ఉన్నందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని మిథాలీ లేఖలో పేర్కొన్నారు. సుదీర్ఘకాలం భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నట్టు తెలిపారు. ఈ ప్రయాణంలో అడుగడుగునా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీసీసీఐ, కార్యదర్శి జై షాకు మిథాలీ ధన్యవాదాలు తెలిపారు. ఇండియా జెర్సీ వేసుకుని దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమన్న మిథాలీ.. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానని తెలిపారు. ఎంతోమంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు రావాలని భారత మహిళా క్రికెట్‌ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలని మిథాలీరాజ్‌ భావోద్వేగ లేఖను విడుదల చేశారు.

మహిళా క్రికెట్‌లో ఎన్నో రికార్డులు..: 1999 జూన్‌ 26న అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశారు. 2022 మార్చి 27న మిథాలీ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడారు. 23 ఏళ్లపాటు బ్యాటుతో కనికట్టు చేసి క్రికెట్ ప్రేమికులను మంత్రుముగ్దులను చేశారు. సుదీర్ఘ కెరీర్‌లో 232 వన్డేలు ఆడి 7 వేల 805 పరుగులు చేసిన మిథాలీ.. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు లిఖించారు. మొత్తం 7,805 పరుగుల్లో ఏడు శతకాలు.. 64 అర్థ శతకాలు ఉన్నాయి. సుదీర్ఘ కెరీర్‌లో 12 టెస్టులు ఆడిన మిథాలీరాజ్‌.. ఒక ద్విశతకం సహా 4అర్థశతకాలతో 699 పరుగులు చేశారు. మహిళల టెస్ట్‌ క్రికెట్‌లో.. ద్వి శతకం చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. 19 ఏళ్ల వయసులో మిథాలి నెలకొల్పిన ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. 89 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ.. 17 అర్థ శతకాలతో 2 వేల 364 పరుగులు చేశారు. 3 ఫార్మట్లలో కలిపి 10 వేల 868 పరుగులు చేసిన మిథాలీ అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అని ఫార్మట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర లిఖించారు. ఆరు ప్రపంచకప్‌లలో పాల్గొన్న మిథాలీ వరల్డ్‌ కప్‌లో వరుసగా ఏడు అర్థ శతకాలు సాధించి మరో రికార్డును కూడా నెలకొల్పారు. మిథాలీ సారథ్యంలోని జట్టు 2005, 2017లో ప్రపంచకప్‌ ఫైనల్‌కి చేరింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన మిథాలీకి ప్రపంచకప్‌ సాధించాలన్న కల మాత్రం నెరవేరలేదు.

సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన మిథాలీరాజ్‌ను.. ఎన్నో అవార్డులు వరించాయి. 2003లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మిథాలీని 2017లో యూత్‌ స్పోర్ట్స్‌ ఐకాన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ అవార్డు వరించింది. 2017లో బీబీసీ ప్రచురించిన అత్యంత ప్రభావ వంతమైన 100 మంది మహిళల జాబితాలో మిథాలీరాజ్‌కు చోటు దక్కింది. 2017లోనే ప్రతిష్ఠాత్మకమైన విజ్డన్‌ లీడింగ్‌ ఉమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు అందుకున్నారు. 2021లో భారత అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌ రత్నా అవార్డుతో ప్రభుత్వం... మిథాలీని గౌరవించింది.

క్రికెటర్‌గా తన ప్రయాణం ముగిసినా ఆటలో ఏదో విధంగా భాగస్వామ్యం అవుతానంటూ భవిష్యత్‌ ప్రణాళికల గురించి సూచనాప్రాయంగా మిథాలీ తెలిపారు. భారత మహిళా క్రికెట్‌కు సేవలు అందించడంలో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు.

ఇదీ చూడండి : కోచ్​పై లైంగిక​ ఆరోపణలు.. భారత సైక్లిస్ట్​ బృందం రిటర్న్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.