ETV Bharat / sports

Legends League: లెజెండ్స్ లీగ్​ విజేతగా వరల్డ్​ జెయింట్స్​ - లెజెండ్స్​ లీగ్​ క్రికెట్ ఫైనల్ వరల్డ్ జెయింట్స్​

Legends League cricket Final: లెజెండ్స్​ లీగ్​ క్రికెట్​ ఫైనల్ శనివారం రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్​లో వరల్డ్​ జెయింట్స్​ 25 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది.

Legends League cricket Final World Giants win the trophy
టైటిల్​ విజేతగా వరల్డ్​ జెయింట్స్​
author img

By

Published : Jan 30, 2022, 8:11 AM IST

Legends League cricket Final: లెజెండ్స్​ లీగ్​ క్రికెట్​లో మాజీ ఆటగాళ్లు అదరగొట్టారు. ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడుతూ తమ పాత రోజులను గుర్తుచేశారు. శనివారం జరిగిన ఫైనల్​ ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్​లో వరల్డ్​ జెయింట్స్​ 25 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. సీజే అండర్సన్​(94*) సెంచరీకి చేరువగా రాగా, పీటర్సన్​(48) హాఫ్​ సెంచరీతో మెరిశాడు. కోరీ అండర్సన్​ ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.

257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆసియా లయన్స్​ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 231 పరుగులకే పరిమితమైంది. ఈ జట్టులో మహ్మద్​ యూసఫ్​ 39 టాప్​ స్కోరర్​. సనత్​ జయసూర్య(38), ఉపుల్​ థరంగా(25), తిలకరత్నే దిల్షన్​(25), అస్గర్​ అఫ్గాన్​(24) నామమాత్రంగా ఆడారు. వరల్డ్ జెయింట్స్​ బౌలర్లలో అల్బి మోర్కల్​ 3, మాంటీ పనేసర్​ 2, రియాన్​ జై, మార్నె మోర్కల్​, కెవిన్​ పీటర్సన్​ తలో వికెట్​ తీశారు.

తొలుత టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన వరల్డ్​ జెయింట్స్​లో బ్యాటర్లు అదరగొట్టారు. ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించారు. అయితే 65 పరుగులకే 3 వికెట్లు పడిపోయాయి. ఇందులో ఇంగ్లాండ్​ మాజీ బ్యాటర్​ కెవిన్​ పీటర్సన్ ఒక్కడే మంచి ఇన్నింగ్​ ఆడాడు. కేవలం 22 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్​ మాజీ ఆల్​రౌండర్ కోరి అండర్సన్ ఆసియా లయన్స్​ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షోయబ్​ అక్తర్​ వేసిన ఒకే ఓవర్​లో పీటర్సన్ ఏకంగా​ మూడు సిక్సర్లు బాదాడు. కేవలం 43 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 రన్స్​ చేశాడు. మిగతా ప్రపంచ దిగ్గజాలు కూడా భీకరంగా బౌండరీలు బాదారు. ఆస్ట్రేలియా మాజీ వికెట్​ కీపర్​ బ్రాడ్​ హాడిన్​ 3 సిక్సర్లు, ఒక ఫోరు బాది 24, డారెన్​ సామీ 17 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 38 పరుగులు చేసి రెచ్చిపోయారు. మొత్తంగా నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆసియా లయన్స్​ బౌలర్లలో కులసేకర 3, సి వాస్​, మురళీధరన్​ తలో వికెట్​ దక్కించుకున్నారు.

ఇదీ చదవండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

అండర్‌-19 ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరిన భారత జట్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.