టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటు భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కేవలం ఇన్స్టాగ్రాంలోనే 237 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటే ఈయనకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. విరాట్ ఆటతీరుకే కాదు ఆయన బాడీ ఫిట్‌నెస్‌కు, హెయిర్‌స్టైల్‌కు, డ్రెస్సింగ్, యాటిట్యూడ్‌కు కూడా ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. వయస్సు, జెండర్‌తో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ రన్‌మెషీన్‌ను ఒక్కసారైనా కలవాలి, చూడాలి, అవకాశం వస్తే ఓ సెల్ఫీ దిగేదాకా కూడా ఊరుకోరు. ఇదిలా ఉండగా తాజాగా ఓ మహిళా ఫ్యాన్ కోహ్లిపై తనకున్న ప్రేమను వినూత్నంగా ప్రదర్శించింది. ఏకంగా ఈ కింగ్ మైనపు బొమ్మ పెదాలపై ముద్దు పెట్టేసింది. ప్రస్తుతం ఈ లిప్‌లాక్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఈ వీడియోలో కోహ్లీ బొమ్మకు ముద్దు పెడుతూ, ఆ అమ్మాయి ప్రదర్శించిన ఎక్స్‌ప్రెషెన్స్ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో.. ఈ సీన్ ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు జనాలు తెగ ఆసక్తి చూపుతున్నారు. అయితే దిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈ వీడీయోను ఓ యువతి తీసినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ కోహ్లీ మైనపు బొమ్మను 2018 జూన్‌లో ఏర్పాటు చేశారు.
అయితే ప్రస్తుతం కోహ్లీ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ- 2023 ఆటలో బిజీగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయిన విరాట్.. తొలి టెస్టులో 12, రెండో టెస్టులో 44, 20 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. మొత్తంగా ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్ కలిపి 76 పరుగులు చేశాడు. ఇటీవలి కాలంలో టీ20, వన్డే ఫార్మాట్‌ల్లో శతకాలు బాదిన కోహ్లీ టెస్టుల్లో మాత్రం పేలవ ఫామ్‌ను ప్రదర్శిస్తున్నాడు. అతడు.. 2019 నవంబర్ 22న చివరిసారి టెస్టుల్లో సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే మూడో టెస్టులోనైనా కోహ్లీ శతకం బాదాలని క్రికెట్ లవర్స్ ఆశపడుతున్నారు.
-
Aisi ladkiyon se putle safe nahi hai pic.twitter.com/kaQybcLOOa
— Byomkesh (@byomkesbakshy) February 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Aisi ladkiyon se putle safe nahi hai pic.twitter.com/kaQybcLOOa
— Byomkesh (@byomkesbakshy) February 20, 2023Aisi ladkiyon se putle safe nahi hai pic.twitter.com/kaQybcLOOa
— Byomkesh (@byomkesbakshy) February 20, 2023