Yuvaraj Singh Kohli: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ ప్రత్యేక బహుమతిని పంపాడు. అతడికి గోల్డెన్ షూస్‌ను కానుకగా ఇచ్చాడు. దీంతో పాటే అతడిని ప్రశంసిస్తూ ఓ హృదయపూర్వక లేఖను రాశాడు. తన కళ్ల ముందే కోహ్లీ ఓ ఆటగాడిగా, వ్యక్తిగా ఎంతో ఎదిగాడని గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అతడి ఆట పట్ల ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ.. భావి తరాల వారికి స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడాడు.
-
To the little boy from Delhi @imvkohli
— Yuvraj Singh (@YUVSTRONG12) February 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
I want to dedicate this special shoe to you,celebrating your career n time as captain which has brought smiles to millions of fans all over the world.
I hope you stay the way YOU are, play the way YOU do and keep making the country proud! pic.twitter.com/mwVPPh0JwU
">To the little boy from Delhi @imvkohli
— Yuvraj Singh (@YUVSTRONG12) February 22, 2022
I want to dedicate this special shoe to you,celebrating your career n time as captain which has brought smiles to millions of fans all over the world.
I hope you stay the way YOU are, play the way YOU do and keep making the country proud! pic.twitter.com/mwVPPh0JwUTo the little boy from Delhi @imvkohli
— Yuvraj Singh (@YUVSTRONG12) February 22, 2022
I want to dedicate this special shoe to you,celebrating your career n time as captain which has brought smiles to millions of fans all over the world.
I hope you stay the way YOU are, play the way YOU do and keep making the country proud! pic.twitter.com/mwVPPh0JwU
"విరాట్.. ఓ క్రికెటర్‌గా, వ్యక్తిగా నువ్వు ఎదగడం నేను చూశాను. నెట్స్‌లో కుర్రాడిగా ఉన్నప్పటి నుంచి దిగ్గజాలతో కలిసి ఆడే స్థాయికి ఎదిగావు. ఇప్పుడు నువ్వూ ఓ దిగ్గజ ఆటగాడివే. కొత్త తరానికి మార్గదర్శివి. నెట్స్‌లో నీ క్రమశిక్షణ, మైదానంలో ఆట పట్ల నీ ప్యాషన్, డెడికేషన్.. దేశంలో ఉన్న ప్రతి పిల్లవాడికి ఏదో ఓ రోజు టీమ్ఇండియా జెర్సీ ధరించి, బ్యాట్ పట్టుకోవాలని అనిపించే స్ఫూర్తినిస్తుంది. ప్రతిఏడాది నీ క్రికెట్ జ్ఞానాన్ని పెంచుకుంటూ వచ్చావు. ఈ ఆటలో ఎంతో సాధించావు. ఓ లెజెండరీ కెప్టెన్, గొప్ప నాయకుడివి అయ్యావు. నీ నుంచి మరెన్నో గొప్ప ఇన్నింగ్స్ రావాలని కోరుకుంటున్నాను. సహచర ఆటగాడిగా, స్నేహితుడిగా నీతో ఉన్న బంధం గురించి మాటల్లో చెప్పలేను. కలిసి పరుగులు చేయడం, డైట్ విషయంలో చీటింగ్.. పంజాబీ పాటలు వినడం, కప్ సాధించడం.. వీటన్నింటిలో మనం కలిసే ఉన్నాం. నువ్వు ప్రపంచానికి కింగ్ కోహ్లీవి కావొచ్చు. కానీ నాకు మాత్రం ఎప్పటికీ 'చీకూ'వే. నీలోని పట్టుదల, గెలవాలన్న కసి, దూకుడుతనం ఎప్పటికీ అలానే ఉండాలి. నువ్వు సూపర్‌స్టార్. నీకోసమే ఈ ప్రత్యేక గోల్డెన్ షూ. ఇలాగే ఎప్పటికీ దేశాన్ని గర్వపడేలా చేయ్"
-యువరాజ్ సింగ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
కాగా, గత కొంతకాలంగా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్న కోహ్లీ.. ఇటీవలే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత అనూహ్య పరిస్థితుల వల్ల వన్డే కెప్టెన్సీని కోల్పోయాడు. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనలో ఓడిపోయిన నేపథ్యంలో టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ బాధ్యతలను స్వీకరించాడు.
ఇదీ చూడండి: అతడి కెరీర్‌ను నాశనం చేయాలనుకోవట్లేదు: సాహా