ETV Bharat / sports

మిచెల్​ స్టార్క్​ అరుదైన ఫీట్​.. 'నాటు నాటు' సాంగ్​కు కోహ్లీ స్టెప్పులు - Mitchell starc 591 wickets

ఆస్ట్రేలియా టీమ్​ఇండియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో మిచెల్​ స్టార్క్​ అరుదైన ఫీట్​ను అందుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్​లో నాటు నాటు సాంగ్​కు టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ చిందులేశాడు. ఆ వీడియో మీకోసం..

Kohli Naatu Naatu song dance goes viral
మిచెల్​ స్టార్క్​ అరుదైన ఫీట్​.. 'నాటు నాటు' సాంగ్​కు కోహ్లీ స్టెప్పులు
author img

By

Published : Mar 17, 2023, 6:52 PM IST

Updated : Mar 17, 2023, 8:05 PM IST

స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా.. క్రికెటర్లు డ్యాన్స్​ వేడయం కొత్తేమీ కాదు. టీమ్అఇండియా మాజీ కెప్టెన్​, స్టార్ బ్యాటర్​ విరాట్ కోహ్లీ కూడా.. ఇంటర్నేషనల్​ మ్యాచులు అయినా.. ఐపీఎల్​ మ్యాచ్​ అయినా.. అప్పుడప్పుడు మైదానంలో చిందులేస్తుంటాడు. ఇప్పుడు ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలోనూ కోహ్లీ తన కాలును కదిపాడు. ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకున్న ఆర్​ఆర్​ఆర్​ సినిమాలోని 'నాటు నాటుట సాంగ్​కు విరాట్ స్టెప్పులేశాడు. ఓవర్ ముగిసిన తర్వాత వచ్చిన చిన్న బ్రేక్​లో స్లిప్‌లో నిలబడిన విరాట్​ 'నాటు నాటు' స్టెప్ వేస్తూ ఫ్యాన్స్​కు కిక్​ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

మిచెల్ స్టార్క్​ అరుదైన మార్క్​.. ఇక ఈ మ్యాచ్​లో లక్ష్య ఛేదనకు దిగిన టీమ్​ఇండియా ఆచితూచి ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్​లో ఆసీస్​ ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఓ అరుదైన మార్క్​ను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన నాలుగో ఆసీస్​ బౌలర్‌గా రికార్డుకెక్కాడు. కోహ్లీని ఔట్‌ చేసిన అనంతరం.. అతడు ఈ ఘతన సాధించాడు. ఇప్పటివరకు వన్డే, టెస్టులు, టీ20లు కలిపి మొత్తంగా 591 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ 999 వికెట్లతో అగ్ర స్థానంలో నిలవగా.. గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ 948 వికెట్లు(రెండో స్థానం), బ్రెట్‌ లీ 718 వికెట్లు(మూడో స్థానం), మిచెల్‌ స్టార్క్‌(591 వికెట్లు) నాలుగో స్థానం, మిచెల్‌ జాన్సన్‌ 590 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇకపోతే ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఆస్ట్రేలియాను.. టీమ్​ఇండియా బౌలర్లు బెంబేలెత్తించారు. కంగారులను 188 పరుగులకే ఆలౌట్‌ చేశారు. మహ్మద్​ షమీ (3/17), సిరాజ్ (3/29) విజృంభించగా.. జడ్డూ 2, హార్దిక్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్ చెరో వికెట్‌ పడగొట్టారు. బౌలింగ్‌ చేసిన భారత్‌.. రెండో ఓవర్‌లోనే వికెట్‌ పడగొట్టింది. అయితే ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ (22)తో కలిసి మిచెల్‌ మార్ష్ (81) స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 72 రన్స్​ జోడించారు. స్మిత్‌ ఔటైనప్పటికీ.. లబుషేన్(15), జోష్​తో(26) కలిసి మార్ష్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అలా ఆసీస్​ ఇన్నింగ్స్​లో మిచెల్‌ మార్ష్ (81) టాప్ స్కోరర్​గా నిలిచాడు. మొత్తంగా మన బౌలర్లు చెలరేగడంతో ఆసీస్​ 188 పరుగులకు కుప్పకూలింది.

ఇదీ చూడండి: జడ్డూ, షమీ, గిల్​ స్టన్నింగ్​ క్యాచ్​లు.. చూశారంటే వావ్​ అనాల్సిందే!

Last Updated : Mar 17, 2023, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.