ETV Bharat / sports

'అతడికంటే కోహ్లీ బెస్ట్.. ఆ బ్యాటర్లంతా విరాట్​ను చూసి నేర్చుకోవాలి' - విరాట్​ కోహ్లీ చేసిన పరుగులు

టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్​ విరాట్​ కోహ్లీపై భారత జట్టు మాజీ సారథి మహ్మద్​ అజహరుద్దీన్​ ఆసక్తికర కామెంట్లు చేశారు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్​ అజామ్​ కంటే విరాట్​ బెస్ట్​ ప్లేయర్​ అని కొనియాడారు. ​ఇంకా ఏమన్నారంటే..

babar vs kohli mohammed azharuddin
babar vs kohli mohammed azharuddin
author img

By

Published : Jan 29, 2023, 5:33 PM IST

టీమ్​ఇండియా స్టార్​ హిట్టర్​ విరాట్​ కోహ్లీ, పాకిస్థాన్​ బ్యాటర్ బాబర్​ అజామ్​లలో ఎవరు బెస్ట్​ అనే చర్చ నడుస్తోంది. ఈ చర్చకు తెరదించుతూ భారత మాజీ సారథి మహ్మద్​ అజహరుద్దీన్​ తన తీర్పును ఇచ్చారు. అజామ్​ కన్నా విరాట్​ కోహ్లీనే బెస్ట్​ అని చెప్పేశాడు. క్రికెట్​ సామర్థ్యాల్లో విరాట్​ మందంజలో ఉన్నాడని చెప్పారు. కోహ్లీ చాలా అనుభవం ఉన్నవాడని.. అది అతడి గణాంకాలు చూస్తే అర్థమౌతుందని అన్నారు. అందుకే బాబర్​ అజామ్​ కన్నా.. విరాట్​ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడని చెప్పారు. అలాగే బాబర్​తో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు.

'కోహ్లీ చాలా అనుభవజ్ఞుడైన ప్లేయర్. అతడి గణాంకాలు చాలా ఎక్కువ. విరాట్​ కోహ్లీ, బాబర్​ అజామ్​ను పోల్చడం ఎప్పుడూ కష్టమే. వీరిద్దరూ చాలా భిన్నమైన ఆటగాళ్లు. బాబర్​తో పోలిస్తే.. కోహ్లీ కాస్త మెరుగైన ఆటగాడు. అతడు ఎప్పుడూ నేర్చుకోవాలనే ఆసక్తితో ఉంటాడు. 2019 ప్రపంచకప్‌లో మ్యాచ్​ తర్వాత అతడు నాతో మాట్లాడాడు. కోహ్లీ నేర్చుకోవాలనే ఆసక్తితో ఉంటాడని నేను ఎప్పుడూ చెబుతుంటాను.. అందుకే విరాట్ అన్ని ఫార్మాట్లలో రాణించడం ఆశ్చర్యమేమీ లేదు. కోహ్లీ చాలా టాలెంటెడ్​ ప్లేయర్.'

-- మహ్మద్​ అజహరుద్దీన్​, టీమ్ఇండియా మాజీ కెప్టెన్

34 ఏళ్ల వయసులోనూ.. అన్ని ఫార్మాట్లలో కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడారు. టాప్​ ఆర్డర్​ బ్యాటర్లంతా కోహ్లీని చూసి నేర్చుకోవాలని.. అతడు చాలా టాలెంట్​ కలిగిన క్రికెటర్​ అని విరాట్​పై ప్రశంసల వర్షం కురిపించాడు.
కాగా, 2008లో అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అన్నిఫార్మాట్లలో కిలిపి 24, 936 పరుగులు చేశాడు. ఇందులో 74 సెంచరీలు చేశాడు. క్రికెట్​ చరిత్రలో సచిన్​ తెందూల్కర్ తర్వాత ఇవి రెండో అత్యధిక సెంచరీలు. ఇక, బాబర్​ 28 సెంచరీలతో 11,864 పరుగులు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.