ETV Bharat / sports

ఒక్కో ఇన్​స్టా పోస్టుకు కోహ్లీ సంపాదన ఎంతంటే..? - కోహ్లీ సంపాదన

Kohli Instagram Income: గతేడాది సోషల్​ మీడియా పోస్టులతో అత్యధికంగా ఆర్జించిన సెలబ్రిటీల జాబితాలో టాప్​-20లో నిలిచాడు టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. ఒక్కో పోస్టుకు కోహ్లీ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

kohli
కోహ్లీ
author img

By

Published : Jan 8, 2022, 5:28 PM IST

Kohli Instagram Income: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు సెలబ్రిటీలు. ఇన్​స్టా గ్రామ్, ఫేస్​బుక్, ట్విట్టర్​ ద్వారా ఎప్పటికప్పడు అప్​డేట్స్​ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్​తో సాన్నిహిత్యం పెంచుకుంటూనే ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. యాడ్స్, ప్రమోషన్స్​ రూపంలో కోట్లల్లో ఆర్జిస్తున్నారు.

ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్​స్టా వేదికగా అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాలో టాప్​-20లో నిలిచాడు టీమ్​ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ. ఒక్కో పోస్టుకు 6,80,000 డాలర్లు(దాదాపు 5 కోట్లు) సంపాదిస్తున్నాడు. అయితే.. ఈ జాబితాలో టాప్​-50లో కోహ్లీ తర్వాత స్థానం సంపాదించుకున్న ఏకైక భారతీయురాలిగా నిలిచింది నటి ప్రియాంకా చోప్రా. ఈమెకు 27 స్థానం దక్కిందని ఫోర్బ్స్​ ఇండియా వెల్లడించింది.

177 మిలియన్​ ఫాలోవర్స్..

2021లో యాహూ వెల్లడించిన వివరాల ప్రకారం.. నెట్​లో ఓ ఆటగాడి కోసం ఎక్కువ మంచి సెర్చ్ చేసిన జాబితాలో కోహ్లీ టాప్​లో నిలిచాడు. ఇన్​స్టా వేదికగా 150 మిలియన్​ ఫాలోవర్స్ ఉన్న మొదటి సెలబ్రిటీగానూ కోహ్లీ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం విరాట్​కు 177 మిలియన్​ ఫాలోవర్స్ ఉన్నారు.

నంబర్​ వన్​ రొనాల్డో..

ఫుట్​బాల్​ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఇన్​స్టా పోస్టులతో అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల్లో తొలిస్థానంలో ఉన్నాడు. అతడి సంపాదన 16,04,000 డాలర్లు. ప్రస్తుతం రొనాల్డోకు 387 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇదీ చదవండి:

కోహ్లీపై వ్యంగ్యాస్త్రాలు.. ఓ వెబ్​సైట్​కు జాఫర్ కౌంటర్

కోహ్లీ వైఫల్యాలు సహజమే.. ఒత్తిడితోనే అలా: వార్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.