KL Rahul: లఖ్‌నవూ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. నాలుగు సీజన్లలో 600కుపైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆర్సీబీతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 58 బంతుల్లో 79 పరుగులు చేశాక రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడి 661 పరుగులు చేసి టాప్ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు.
IPL Records: 2021 ఐపీఎల్లో పంజాబ్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడిన రాహుల్ 626 పరుగులు చేశాడు. 2020 సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడి 670 పరుగులు, 2018లో 659 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్లో నాలుగు సార్లు 600ప్లస్ పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా అవతరించాడు. రాహుల్ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. వీరిద్దరు మూడు ఐపీఎల్ సీజన్లలో 600కుపైగా పరుగులు చేశారు.
IPL News: వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఆర్సీబీ తరఫున ఆడినప్పుడు 2011, 2012, 2013 సీజన్లలో వరుసగా 600కుపైగా పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా సన్‌రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించినప్పుడు 2016, 2017, 2019 సీజన్లలో 600కుపైగా పరుగులు చేశాడు. ఇప్పుడు రాహుల్ నాలుగు సార్లు ఈ ఫీట్ సాధించడం వల్ల వీరిద్దరు రెండో స్థానానికి పరిమితమయ్యారు.
IPL Eliminator: బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో లఖ్‌నవూ ఓడిపోయింది. 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 193 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అహ్మదాబాద్ వేదికగా మే 27న జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది ఆర్సీబీ. ఈ మ్యాచ్‌లో గెలిచిన వారు మే 29న ఫైనల్లో ఢీకొంటారు. ఈ మ్యాచ్ కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగుతుంది.
ఇదీ చదవండి: వేలంపాటలో రూ.20లక్షలకూ అమ్ముడుపోలేదు.. ఇప్పుడు అతడే హీరో..