Kapil Dev Statement On Team India Seniors : టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్లపై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ విమర్శలు కొనసాగుతున్నాయి. భారత క్రికెటర్లు తమకే అన్నీ తెలుసనుకుంటారనీ.. ఎవరినీ సలహా అడగాలని అనుకోరనీ ఇటీవల తీవ్రంగా విమర్శించిన కపిల్.. తాజాగా మరోమారు టీమ్ఇండియా క్రికెటర్లపై మండిపడ్డాడు. ఇటీవల కాలంలో టీమ్ఇండియా కీలక ప్లేయర్స్ గాయాలబారిన పడుతున్నారు. దీంతో మెగా టోర్నీలో టీమ్‌ఇండియా ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల నిబద్ధతను కపిల్ దేవ్ ప్రశ్నించాడు.
Kapil Dev On IPL : చిన్పపాటి గాయాలైనా లెక్కచేయకుండా ఐపీఎల్‌లో ఆడటానికి టీమ్ఇండియా ప్లేయర్లు అభ్యంతరం చెప్పరనీ.. అయితే, జాతీయ జట్టుకు వచ్చేసరికి చిన్న సాకులతో విశ్రాంతి తీసుకోవడానికే ఇష్టపడతారని కపిల్ మండిపడ్డాడు. ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్.. గాయాలబారిన పడ్డ ఆటగాళ్ల పరిస్థితిపై మాట్లాడాడు. అలాగే ఐపీఎల్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
Kapil Dev On Jasprit Bumrah : 'గాయం కారణంగా ఏడాదిగా టీమ్‌ఇండియాకు స్టార్ పేసర్ బుమ్రా దూరమయ్యాడు. త్వరలో రానున్న వన్డే ప్రపంచకప్ నాటికి అతడు సిద్ధం కాకపోతే పరిస్థితి ఏంటి?. బుమ్రాకు ఏమైంది? ఎంతో నమ్మకంతో ఆడతాడు. అయితే.. ప్రపంచకప్ టోర్నీకి అందుబాటులో లేకపోతే.. అతడి కోసం సమయం వెచ్చించడం వృథానే. ఇక రిషభ్ పంత్ గొప్ప క్రికెటర్. అతడు ఉండుంటే.. మన టెస్టు క్రికెట్ మరింత బాగుండేది' అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.
'ఐపీఎల్ గొప్పదే.. అయితే, అదే టీమ్ఇండియా ఆటగాళ్లను దెబ్బతీస్తుంది. చిన్నపాటి గాయాలైనా మీరు ఐపీఎల్‌లో ఆడతారు. టీమ్‌ఇండియా విషయంలో అదే పరిస్థితులు ఎదురైతే మాత్రం ఆడరు. రెస్ట్ తీసుకుంటారు. దీనిని నేను చాలా ఓపెన్‌గా చెబుతున్నాను' అంటూ టీమ్ఇండియా సీనియర్లపై మాజీ దిగ్గజం కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
WI vs Ind 2nd Odi 2023 : ఇక టీమ్‌ఇండియా జట్టులో ప్రయోగాలు చేస్తూ.. విండీస్‌తో రెండో వన్డేలో ఓడిపోయింది. దీంతో జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.