ETV Bharat / sports

ఐపీఎల్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఇకపై మరింత మజా! - ఐపీఎల్​ జైషా

IPL Extended Two and half months: ఐపీఎల్​లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్‌ ఆటగాళ్లు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాడు బీసీసీఐ కార్యదర్శి జై షా. లీగ్​ను మరో రెండు వారాలు పొడిగించేలా చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించాడు.

IPL extended
ఐపీఎల్​
author img

By

Published : Jun 29, 2022, 3:18 PM IST

IPL Extended Two and half months: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్​ను 75 రోజులపాటు నిర్వహించేలా బీసీసీఐ తన చర్యలను ముమ్మరం చేసింది. ఐసీసీ భవిష్యత్తు పర్యటనల జాబితాలోనూ చేరుస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. కొత్త ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన లేదని అన్నాడు. ప్రస్తుతం ఉన్న ప్రకారం పది జట్లతోనే నిర్వహిస్తామన్నాడు.

"భారత టీ20 లీగ్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని ఐసీసీతోపాటు ఇతర దేశాల క్రికెట్‌ బోర్డులతో చర్చలు జరుపుతున్నాం. వచ్చే ఏడాది టీ20 లీగ్‌ను రెండున్నర నెలలపాటు నిర్వహించేలా ఐసీసీ క్యాలెండర్‌లోనూ అవకాశం కల్పిస్తాం. టాప్‌ ఆటగాళ్లు తప్పకుండా హాజరవుతారు. ఈ లీగ్‌ను విస్తరించే క్రమంలో ఆట నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. క్షేత్రస్థాయి నుంచి బలంగా ఉండేలా చర్యలు చేపడుతూనే ఉంటాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తాం" అని జై షా పేర్కొన్నాడు.

ఇప్పటి వరకు టీ20 లీగ్‌లో రెండు నెలలపాటు 74 మ్యాచ్‌లను నిర్వహించేవారు. ఇక రెండున్నర నెలలపాటు నిర్వహిస్తే మాత్రం మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐ భారీ మొత్తం దక్కించుకొంది. అలాగే 2024-2031 భవిష్యత్‌ పర్యటనల కార్యాచరణను నిర్దేశించడానికి ఐసీసీ గవర్నింగ్‌ కౌన్సిల్ వచ్చే నెలలో సమావేశం కానుంది. ఈ క్రమంలో అనుబంధ దేశాలతోపాటు టాప్‌ జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడేలా సమగ్రమైన క్యాలెండర్‌ను రూపొందించడమే తమ లక్ష్యమని జై షా వెల్లడించాడు.

ఇదీ చూడండి: మలేషియా ఓపెన్​లో దుమ్ము రేపిన సింధు.. నిరాశపరిచిన సైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.