Ishan Kishan Stumping : టీమ్ఇండియా జోరుకు బ్రేక్ పడింది. మూడో టీ20లో భారత బౌలర్లు తేలిపోయారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో సజీవంగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటింది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెలరేగిన వేళ ప్రత్యర్థి జట్టు.. సిరీస్‌లో తొలి విజయం నమోదు చేసింది. అయితే చివరి ఓవర్ దాకా టీమ్ఇండియా చేతుల్లో ఉన్న మ్యాచ్.. ఇషాన్ కిషన్ తప్పిదం వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ఆసీస్ ఓ దశలో 9 బంతుల్లో 33 పరుగులు చేయాలి. ఆ ఓవర్ అక్షర్ పటేల్ బౌలింగ్ చేస్తున్నాడు. 19.4వ బంతిని మాథ్యూ వేడ్.. క్రీజును వదిలి ముందుకు వచ్చి ఆడబోయాడు. కానీ, బ్యాట్‌ను మిస్ అయిన బంతి.. ఇషాన్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఇషాన్.. స్టంపింగ్ చేసి అప్పీల్ చేశాడు. రిప్లేలో ఫలితం నాటౌట్‌గా తేలింది. అయితే బంతిని అందుకునే క్రమంలో ఇషాన్ గ్లోవ్స్ స్టంప్స్ కన్నా ముందుకు వచ్చాయి.
దీంతో అంపైర్ ఈ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు. వచ్చిన ఛాన్స్‌ను దొరకబుచ్చుకున్న వేడ్.. ఫ్రీహిట్‌ను సిక్స్‌గా మలిచాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. బౌలర్ వేసిన బంతిని, వికెట్ కీపర్ స్టంప్స్ వెనకాలే అందుకోవాలి. గ్లవ్స్ ఏ మాత్రం ముందుకు వచ్చినా.. దాన్ని అంపైర్ నోబాల్‌గా డిక్లేర్ చేయవచ్చు. అయితే ఇషాన్ ఈ స్టంపింగ్ అప్పీల్ చేయకపోతే.. ఆసీస్‌కు ఫ్రీ హిట్ వచ్చేది కాదు. ఇక 20వ ఓవర్లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. కెప్టెన్ సూర్యకుమార్, ప్రసిద్ధ్ కృష్ణకు బంతినిచ్చాడు. ఈ ఓవర్లో ప్రసిద్ధ్ వరుసగా 4,1,6,4,4,4 సమర్పించుకున్నాడు. దీంతో ఆసీస్ విజయం ఖరారైంది.
-
Looks like Ishan Kishan is playing for Australia.#INDvsAUS pic.twitter.com/xm41rIGPpV
— 𝐒 𝐰 𝐚 𝐫 𝐚 ⎋ (@SwaraMSDian) November 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Looks like Ishan Kishan is playing for Australia.#INDvsAUS pic.twitter.com/xm41rIGPpV
— 𝐒 𝐰 𝐚 𝐫 𝐚 ⎋ (@SwaraMSDian) November 28, 2023Looks like Ishan Kishan is playing for Australia.#INDvsAUS pic.twitter.com/xm41rIGPpV
— 𝐒 𝐰 𝐚 𝐫 𝐚 ⎋ (@SwaraMSDian) November 28, 2023
మ్యాక్స్ అదరహొ.. 223 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ బ్యాటర్ మ్యాక్స్‌వెల్ (104 నాటౌట్, 48 బంతుల్లో 8×4, 8×6) శతకంతో అదరగొట్టాడు. బౌండరీలే లక్ష్యంగామ్యాక్స్ దుమ్మురేపాడు. అతడు సాధించిన 104 స్కోర్‌లో 80 పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అతడి విధ్వంసంతో ఆసీస్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇక భారత బౌలర్ ప్రసిద్ధ్.. 4 ఓవర్లలో వికెట్ లేకుండా 68 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.
-
'I conceded 30 in 6 balls? No problem, I'll score 104 in 48' 😅
— Ishrat Fatima❤️ (@Ishrat154) November 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Glenn Maxwell leaves us all in wonder, yet again! Maxi Is at his best.
Australia#INDvsAUS #PSL9Draft #PSL9 pic.twitter.com/wQP3EaVR6b
">'I conceded 30 in 6 balls? No problem, I'll score 104 in 48' 😅
— Ishrat Fatima❤️ (@Ishrat154) November 28, 2023
Glenn Maxwell leaves us all in wonder, yet again! Maxi Is at his best.
Australia#INDvsAUS #PSL9Draft #PSL9 pic.twitter.com/wQP3EaVR6b'I conceded 30 in 6 balls? No problem, I'll score 104 in 48' 😅
— Ishrat Fatima❤️ (@Ishrat154) November 28, 2023
Glenn Maxwell leaves us all in wonder, yet again! Maxi Is at his best.
Australia#INDvsAUS #PSL9Draft #PSL9 pic.twitter.com/wQP3EaVR6b
-
That's that from the third T20I, Australia win by 5 wickets.
— BCCI (@BCCI) November 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The five match series now stands at 2-1.#INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/3a2wbpIHPV
">That's that from the third T20I, Australia win by 5 wickets.
— BCCI (@BCCI) November 28, 2023
The five match series now stands at 2-1.#INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/3a2wbpIHPVThat's that from the third T20I, Australia win by 5 wickets.
— BCCI (@BCCI) November 28, 2023
The five match series now stands at 2-1.#INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/3a2wbpIHPV