ETV Bharat / sports

రాహుల్​కు అదో పెద్ద తలనొప్పి.. వాట్సన్​ షాకింగ్​ కామెంట్స్​! - షేన్​ వాట్సన్​

Watson on KL Rahul: ప్రస్తుత ఐపీఎల్​లో కొత్త జట్టు లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ మంచి ప్రదర్శనే చేస్తోంది. ఆడిన 3 మ్యాచ్​ల్లో రెండు గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. అయితే ఆ టీం కెప్టెన్​ కేఎల్​ రాహుల్​పై షాకింగ్ కామెంట్స్​ చేశాడు దిల్లీ క్యాపిటల్స్​ అసిస్టెంట్​ కోచ్​, ఆసీస్​ మాజీ ప్లేయర్​ షేన్​ వాట్సన్​.

Problem of plenty can be a great headache for captain: Shane Watson

author img

By

Published : Apr 7, 2022, 2:21 PM IST

Watson on KL Rahul: ఐపీఎల్​లో భాగంగా గురువారం రోజు.. లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​, దిల్లీ క్యాపిటల్స్​ మధ్య మ్యాచ్​ జరగనుంది. ముంబయి డీవై పాటిల్​ స్పోర్ట్స్​ అకాడమీ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. గత మ్యాచ్​లో సన్​రైజర్స్​పై గెలిచి లఖ్​నవూ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. మరోవైపు గుజరాత్​పై ఓడిన దిల్లీ ఈ మ్యాచ్​లో గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. లఖ్​నవూ ఆడిన 3 మ్యాచ్​ల్లో రెండు గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. దిల్లీ ఆడిన రెండిట్లో ఒకటి గెలిచి మరోటి ఓడి.. పాయింట్స్​ టేబుల్​లో ఏడో స్థానంలో కొనసాగుతోంది.

అయితే నేడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్​కు ముందు మీడియాతో మాట్లాడాడు దిల్లీ అసిస్టెంట్​ కోచ్​ షేన్​ వాట్సన్​. లఖ్​నవూ టీం గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులో జేసన్​ హోల్డర్​, కృనాల్​ పాండ్య, దీపక్​ హుడా వంటి చక్కటి నైపుణ్యం గల ఆల్​రౌండర్లు ఉన్నారని, కానీ అదే కెప్టెన్​ కేఎల్​ రాహుల్​కు టోర్నీ మొత్తం తలనొప్పిగా మారుతుందని షాకింగ్​ కామెంట్స్​ చేశాడు.

''జట్టులో నాణ్యమైన ఆల్​రౌండర్లు ఉండటం నిజంగా కెప్టెన్​కు ప్లస్సే. అందులో సందేహం లేదు. ప్రధాన బౌలర్లు ఎవరైనా లేకుంటే.. వీళ్లను ఉపయోగించుకోవచ్చు. నష్టాన్ని కాస్త తగ్గించుకోవచ్చు. కృనాల్​ పాండ్య బాగా బౌలింగ్​ చేస్తున్నాడు. దీపక్​ హుడా, జేసన్​ హోల్డర్​ గత మ్యాచ్​లో మంచి ఆల్​రౌండ్​ ప్రదర్శన చేశారు. అయితే.. ఇక్కడే కెప్టెన్​ రాహుల్​కు పెద్ద తలనొప్పి తెస్తుంది. ఏ ఓవర్​ ఎవరితో వేయించాలో తెలియక సతమతం అవుతాడు. ప్లాన్స్​ అన్నీ బెడిసికొడతాయి.''

- షేన్​ వాట్సన్​, దిల్లీ అసిస్టెంట్​ కోచ్​

లఖ్​నవూలో ఆల్​రౌండర్లు కృనాల్​ పాండ్య 3 మ్యాచ్​ల్లో 3 వికెట్లు తీయడం సహా 27 పరుగులు చేశాడు. దీపక్​ హుడా బ్యాట్​తో 119 పరుగులతో రాణించి.. ఒక వికెట్​ తీశాడు. ఒకే మ్యాచ్​ ఆడిన హోల్డర్​ 34 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. బ్యాటింగ్​లో ఆఖరి ఓవర్లో సిక్స్​ బాది జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. దిల్లీలోనూ అక్షర్​ పటేల్​, లలిత్​ యాదవ్​, శార్దుల్​ ఠాకుర్​ వంటి ఆల్​రౌండర్లు ఉన్నప్పటికీ నిలకడగా రాణించట్లేదు.

ఇవీ చూడండి: ఎస్​ఆర్​హెచ్​పై లఖ్​నవూ సూపర్ జెయింట్స్ ఘన విజయం

కోహ్లీపై పాక్​ ఫ్యాన్​ కామెంట్​.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ఇండియన్​!

'బేబీ ఏబీ' నో లుక్​ సిక్స్​ చూశారా? మ్యాచ్​కే హైలైట్​..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.