నేడు (సెప్టెంబర్ 20) అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్(rcb vs kkr 2021) జరుగుతోన్న మ్యాచ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ(virat kohli records) ఓ రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 మ్యాచ్‌లు ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఒకే ఫ్రాంచైజీకి 200 మ్యాచ్‌లు ఆడలేదు. అయితే, ఓవరాల్‌గా చూసుకుంటే ఆర్సీబీ(virat kohli rcb news) తరఫున విరాట్‌కి ఇది 215 మ్యాచ్. ఛాంపియన్స్ లీగ్ టీ20లో ఆర్‌సీబీ తరఫున 15 మ్యాచ్‌లు ఆడాడు. కేవలం ఐపీఎల్ పరంగా చూసుకుంటే ఓ ఫ్రాంచైజీ తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన వారిలో కోహ్లీ (200) తర్వాత ధోనీ (182, చెన్నై), రైనా (172, చెన్నై), పొలార్డ్ (172, ముంబయి), రోహిత్ శర్మ (162, ముంబయి) ఉన్నారు.
ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్‌గా తప్పుకుంటానని విరాట్ కోహ్లీ(virat kohli captaincy news) ప్రకటించాడు. అయితే, ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్సీబీ(virat kohli rcb news)కే ప్రాతినిధ్యం వహిస్తానని స్పష్టం చేశాడు. ఆటగాడిగా విజయవంతమైన కోహ్లీ(virat kohli news).. కెప్టెన్‌గా ఆర్సీబీని ఇంతవరకు ఛాంపియన్‌గా నిలపలేకపోయాడు. అతడి కెప్టెన్సీలో 2016లో ఫైనల్ చేరడమే బెంగళూరుకు అత్యుత్తమ ప్రదర్శన. ఈ సారి అయినా ఆర్సీబీని విజేతగా నిలుపుతాడో లేదో చూడాలి.
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు
ఆటగాడు | మ్యాచ్‌లు | ప్రస్తుతం ఆడుతున్న జట్టు |
ఎం.ఎస్.ధోనీ | 212 | చెన్నై సూపర్ కింగ్స్ |
రోహిత్ శర్మ | 207 | ముంబయి ఇండియన్స్ |
దినేశ్ కార్తీక్ | 204 | కోల్‌కతా నైట్‌రైడర్స్ |
సురేశ్ రైనా | 201 | చెన్నై సూపర్ కింగ్స్ |
విరాట్ కోహ్లీ | 200 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు |