ETV Bharat / sports

లఖ్​నవూ కెప్టెన్​గా కృనాల్​.. బీసీసీఐ ​పర్యవేక్షణలో కేఎల్ రాహుల్​! - బీసీసీఐ హ్యాండిల్ చేస్తున్న రాహుల్ గాయం

కేఎల్ రాహుల్​ గాయాన్ని బీసీసీఐ హ్యాండిల్ చేస్తున్నట్లు తెలిసింది. అతడు తన తర్వాతి ఐపీఎల్​ మ్యాచులను ఆడే విషయంతో పాటు ఎలాంటి చికిత్స అందించాలనే విషయమై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుందని ఓ బోర్డు అధికారి తెలిపారు.

KL rahul
లఖ్​నవూ కెప్టెన్​గా కృనాల్​.. కేఎల్​ రాహుల్ గాయంపై బీసీసీఐ ​
author img

By

Published : May 3, 2023, 1:26 PM IST

Updated : May 3, 2023, 2:17 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ 2023 సీజన్​లో భాగంగా.. రీసెంట్​గా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ కెప్టెన్​ కేఎల్‌ రాహుల్‌ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతడు తర్వాతి మ్యాచులకు ఆడతాడా లేదా అనేది సందిగ్ధంగా మారింది. అయితే ఇప్పుడతడు మిగతా మ్యాచులకు దూరమవ్వనున్నాడని దాదాపుగా స్పష్టమైంది. అతడికి స్థానంలో స్టాండ్ ఇన్​ కెప్టెన్​గా కృనాల్​ పాండ్య జట్టును నడిపిస్తాడని సమాచారం.

అయితే కేఎల్​ రాహుల్ గాయం తీవ్రమైందని, అతడి గాయానికి సంబంధించిన విషయాన్ని బీసీసీఐ టేకప్​ చేసిందని తెలిసింది. ఐపీఎల్​లో తదుపరి మ్యాచుల్లో అతడు ఆడాలా వద్దా అనే విషయంపై తుది నిర్ణయం కూడా బోర్డే తీసుకోనుందని సమాచారం. రాహుల్ బీసీసీఐ కాంట్రాక్​ ప్లేయర్​ కావడం, వచ్చే నెలలో డబ్ల్యూటీసీ ఫైనల్ ​ ఉన్న నేపథ్యంలో అతడి గాయం విషయాన్ని బీసీసీఐ సీరియస్​గా​ తీసుకుందట. తద్వారా ఇక నుంచి అతడు ఎన్‌సీఏ సలహా మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది.

"కేఎల్ రాహుల్ ప్రస్తుత లఖ్​నవూ టీమ్​తోనే ఉన్నాడు. గురువారం సీఎస్కేతో మ్యాచ్​ జరిగాక క్యాంప్​ను వీడుతాడు. అతడికి గాయానికి సంబంధించి స్కానింగ్​లను ముంబయిలో బీసీసీఐ ఏర్పాటు చేసిన మెడికల్​ ఆధ్వర్యంలోనే చేయిస్తారు. బీసీసీఐ అతడి కేసును హ్యాండిల్ చేస్తుంది. ఇలాంటి గాయం తగిలినప్పుడు నొప్పి, వాపు కనీసం 24 నుంచి 48 గంటలకు వరకు ఉంటుంది. అప్పటికీ తగ్గకపోతే స్కానింగ్ నిర్వహిస్తాం. అతడు టెస్ట్ టమ్​లో కీలకమైన ప్లేయర్​. కాబట్టి అతడు ఐపీఎల్ తదుపరి మ్యాచుల్లో అడకపోవడమే మంచిది. స్కానింగ్ చేసిన తర్వాత అతడికి ఎలాంటి చికిత్స అందించాలో, ఆడే విషయంపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది" అని ఓ బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు.

ఇకపోతే ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌ ఇప్పటివరకు తొమ్మిది మ్యాచులు ఆడింది. అందులో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు ఈ లీగ్‌ కీలక ప్లేఆఫ్స్ దశకు చేరుతున్న తరుణంలో.. రాహుల్​ గాయం కారణంగా దూరం అవ్వడం లఖ్​నవూ పెద్ద దెబ్బ అనే చెప్పాలి. కాగా ఈ పాయింట్ల పట్టికలో.. గుజరాత్‌ అగ్రస్థానంలో ఉండగా.. రాజస్థాన్‌ -రెండో స్థానం, చెన్నై-నాలుగు, ఆర్సీబీ-ఐదు, పంజాబ్‌- ఆరో స్థానంలో ఉన్నాయి. ఫలితంగా ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచాయి.

ఇదీ చూడండి: IPL 2023 highest individual score : అగ్రస్థానంలో యశస్వి, వెంకటేశ్​.. టాప్​-10లో ఇంకా ఎవరున్నారంటే?

Last Updated : May 3, 2023, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.