ETV Bharat / sports

IPL Awards 2021: రుతురాజ్, హర్షల్ రికార్డులే రికార్డులు

ఐపీఎల్ 14వ సీజన్​లో పలువురు యువ క్రికెటర్లు అదరగొట్టారు. అందులోని ఇద్దరు ఆరెంజ్​, పర్పుల్ క్యాప్​ సొంతం (IPL Awards 2021) చేసుకున్నారు. వాటితో పాటే అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆ క్రికెటర్లు ఎవరంటే?

IPL ORANGE CAP, PURPLE CAP HOLDERS
ఐపీఎల్ న్యూస్
author img

By

Published : Oct 15, 2021, 9:25 PM IST

Updated : Oct 16, 2021, 8:30 AM IST

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​లో చెన్నై ఓపెనర్​గా వచ్చి, విజయాల్లో భాగమైన యువ ఓపెనర్​ రుతురాజ్ గైక్వాడ్ (ruturaj gaikwad ipl runs) రికార్డు సృష్టించాడు. ఈసారి అత్యధిక పరుగుల వీరుడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ (IPL Awards 2021)​ సొంతం చేసుకున్నాడు. మొత్తంగా 16 మ్యాచ్​ల్లో 635 పరుగులతో నిలిచాడు. ఆరెంజ్​ క్యాప్​తో పాటు ఎమర్జింగ్ ప్లేయర్​ ఆఫ్​ ది సీజన్​ అవార్డు కూడా రుతురాజ్​కు దక్కింది.

ruturaj gaikwad ipl runs
ఆరెంజ్​ క్యాప్​తో రుతురాజ్ గైక్వాడ్

ఐపీఎల్​లో ఈ క్యాప్​ సాధించిన (IPL Awards 2021) అత్యంత పిన్నవయుస్కుడిగా రుతురాజ్​ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ పేరిట ఉంది. ఇతడి తర్వాత స్థానాల్లో డుప్లెసిస్(633), కేఎల్ రాహుల్(626), శిఖర్ ధావన్ (587), మ్యాక్స్​వెల్(513) ఉన్నారు.

హర్షల్​ పటేల్​..

మరోవైపు ఎక్కువ వికెట్లు తీసిన వారికిచ్చే పర్పుల్ క్యాప్ (IPL Awards 2021)​ ఈసారి.. రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు బౌలర్ హర్షల్​ పటేల్​కు(harshal patel ipl) దక్కింది. 15 మ్యాచ్​ల్లో 32 వికెట్లు తీశాడు. ఐపీఎల్​ చరిత్రలో ఓ సీజన్​లో అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్లలో బ్రావోతో కలిసి సమంగా నిలిచాడు. అలానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్​ అవార్డులను కూడా హర్షల్ సొంతం చేసుకున్నారు.

harshal patel ipl
హర్షల్ పటేల్

హర్షల్​కు పర్పుల్​ క్యాప్​ సహా గేమ్​ ఛేంజర్​ ఆఫ్​ ది సీజన్, మోస్ట్​ వాల్యుబుల్​ ​ప్లేయర్​ ఆఫ్​ ది సీజన్​ అవార్డులు దక్కాయి. హర్షల్ తర్వాతి స్థానాల్లో ఆవేశ్ ఖాన్ (24), బుమ్రా(21), షమి(19), అర్షదీప్ సింగ్(18) తదితరులు ఉన్నారు.

క్యాచ్​ ఆఫ్​ ది సీజన్​

పంజాబ్​ కింగ్స్​కు చెందిన రవి బిష్నోయ్​కు క్యాచ్​ ఆఫ్​ ది సీజన్​ అవార్డ్​ దక్కింది. అహ్మదాబాద్​ వేదికగా కేకేఆర్​తో జరిగిన మ్యాచ్​లో సునిల్​ నరైన్​ మిడ్​ వికెట్​ మీదుగా కొట్టిన బంతిని రవి డైవ్​ చేసి అద్భుతమైన క్యాచ్ పట్టాడు.

సూపర్​ స్ట్రైకర్​ ఆఫ్​ ది సీజన్​

168 స్ట్రైక్​ రేట్​ ఉన్నందుకుగాను దిల్లీ క్యాపిటల్స్​కు చెందిన హెట్​మెయిర్​ సూపర్​ స్ట్రైకర్​ ఆఫ్​ ది సీజన్​ అవార్డు అందుకున్నాడు.

మోస్ట్​ సిక్సెస్​ ఆఫ్​ ది సీజన్

ఐపీఎల్​లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా పంజాబ్​ కింగ్స్​ కెప్టెన్ కేఎల్​ రాహుల్​ నిలిచాడు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 16, 2021, 8:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.