కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి శుభారంభం దక్కినా తర్వాత తడబడింది. ఓపెనర్లు స్మిత్, ధావన్ మొదటి వికెట్‌కు 35 పరుగులు జోడించారు. అనంతరం దూకుడు మీదున్న గబ్బర్ను పెవిలియన్ చేర్చాడు ఫెర్గుసన్. తర్వాత వచ్చిన శ్రేయస్ (1) విఫలమయ్యాడు. తర్వాత పంత్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు స్మిత్. వీరిద్దరూ మూడో వికెట్‌కు 37 పరుగులు జోడించాక స్మిత్ (39) ఔటయ్యాడు. కాసేపటికే హెట్మెయర్(4), లలిత్ యాదవ్ (0), అక్షర్ పటేల్ (0), అశ్విన్ (9) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓవైపు వరుస వికెట్లు కోల్పోతున్నా పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో రెండు పరుగులకు ప్రయత్నించిన పంత్ (39) రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో చివరికి 127 పరుగులతో సరిపెట్టుకుంది దిల్లీ.
తడబడిన దిల్లీ బ్యాట్స్‌మెన్.. కోల్‌కతా లక్ష్యం 128
ఐపీఎల్ 2021లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది దిల్లీ.